ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మెలో ఉన్న కార్మికులను ఇకపై విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 1200 మంది మాత్రమే మిగిలి ఉన్నారని ప్రకటించారు సీఎం. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని ఆదేశించారు. అంతేకాదు కొత్త సిబ్బందికి కొన్ని కండిషన్లను పెట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని.. ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించోబోతున్నట్లు స్పష్టంచేశారు.
కొత్త సిబ్బందికి కండిషన్లు:
ఏ యూనియన్లో చేరమని ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి.
కొన్ని ప్రత్యేక షరతులతో కొత్త సిబ్బంది నియామకం ఉంటుంది.
కొత్త సిబ్బందికి కొన్ని నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rtc, Telangana, Telangana News, Tsrtc, TSRTC Strike