TSRTC Strike: ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదనతోనే అతడు సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలిపారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: October 5, 2019, 4:02 PM IST
TSRTC Strike: ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదనతోనే అతడు సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలిపారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
news18-telugu
Updated: October 5, 2019, 4:02 PM IST
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దసరా పండక్కి ఊరెళ్లే ప్రయాణికులు బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లతో కొన్ని బస్సులను తిప్పినా అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్‌లో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆత్మహత్యా యత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదనతోనే అతడు సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలిపారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు సాయంత్రం 6 గంటల లోపు విధుల్లోకి రావాలని ఉద్యోగులకు ప్రభుత్వం చివరి హెచ్చరిక జారీ చేసింది. లేదంటే ఉద్యోగం ఊడుతుందని.. మళ్లీ విధుల్లోకి తీసుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేసింది. ఇక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామత్నాయ ఏర్పాట్లను చేస్తున్నామని.. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడుపుతున్నామని తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టానుసారం చార్జీలు వసూలు చేయకూడదని సూచించారు.

ఇవి కూడా చదవండి:

Vijay Devarakonda: చింపిరి జుట్టుతో అర్జున్ రెడ్డి కొత్త లుక్స్..ఆ హీరో చెమట కంపును తట్టుకోలేకపోయా.. రకుల్ ప్రీత్ సంచలనం
First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...