news18-telugu
Updated: October 15, 2019, 10:21 PM IST
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదాలు కొనసాగుతున్నాయి. బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు.. రూట్లు, బస్సు కండిషన్‌పై అవగాహన లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పెరపెల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాంతో భయపడిపోయిన తాత్కాలిక డ్రైవర్ బస్సును వదిలి పెట్టి పారిపోయాడు.
సోమవారం సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్స సృష్టించిన విషయం తెలిసిందే. సదాశివపేటలో టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. అంతేకాదు నల్లగొండ, హైదరాబాద్, హన్మకొండ సహా పలు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యారు. కొందరు తాత్కాలిక డ్రైవర్లు మద్యం తాగి ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 15, 2019, 10:21 PM IST