#TSRTCStrike : డెడ్‌లైన్ లోపు విధుల్లో చేరిన కార్మికులు ఎంతమందో తెలుసా?

TSRTC Strike : ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగింపుకే మొగ్గుచూపారు. శాంతియుత పద్దతిలో నిరసనను కొనసాగిస్తామని టీఎస్ఆర్టీసీ జేఏసీ అశ్వత్థామరెడ్డి తెలిపారు.

news18-telugu
Updated: October 5, 2019, 8:37 PM IST
#TSRTCStrike : డెడ్‌లైన్ లోపు విధుల్లో చేరిన కార్మికులు ఎంతమందో తెలుసా?
Video : ఆర్టీసీ కార్మికుల సమ్మె... డిపోలో నిలిచిపోయిన బస్సులు
news18-telugu
Updated: October 5, 2019, 8:37 PM IST
దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని శనివారం సాయంత్రం 6గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌కి కార్మికుల
నుంచి ప్రతికూల స్పందనే ఎదురైంది. కేవలం 160మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఇందులో కేవలం ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు ఉండగా.. మిగతావారు సూపర్ వైజర్స్,ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు.ఈ వివరాలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగింపుకే మొగ్గుచూపారు. శాంతియుత పద్దతిలో నిరసనను కొనసాగిస్తామని టీఎస్ఆర్టీసీ జేఏసీ అశ్వత్థామరెడ్డి తెలిపారు.వచ్చే రెండు రోజులకు తమ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. రెండు రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ లేఖలు ఇస్తామన్నారు.ఉదయం 11గంటలకు ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 5గంటలకు అన్ని డిపోల వద్ద కార్మిక కుటుంబాలు బతుకమ్మ ఆడుతారని చెప్పారు. ఇక సోమవారం ఉదయం 8గంటలకు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి.. అనంతరం ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్షకు దిగుతామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు వెనక్కి తగ్గేది లేదని.. సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. విధులకు హాజరుకాని కార్మికులను తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని.. అదే జరిగితే మొదట తననే ఉద్యోగం నుంచి తొలగించాలని అన్నారు.

First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...