Home /News /telangana /

TSRTC STRIKE ONE MORE CONDUCTOR ATTEMPTS SUICIDE IN KONDAPUR SK

TSRTC Strike: బ్లేడ్‌తో కోసుకొని మరో కండక్టర్ ఆత్మహత్యాయత్నం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. పది రోజులైనా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోగా.. ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగించడంతో ఆర్టీసీ కార్మికులు రగిలిపోతున్నారు. మరికొందరు కార్మికులు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ డిపో ఎదుట మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశారు. హెచ్‌సీయూ డిపోలో కండక్టర్‌గా పనిచేసే సందీప్ బ్లేడ్‌తో కోసుకున్నారు. తోటి కార్మికులు వెంటనే ఆయన్ను కొండాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

    ఇప్పటికే తెలంగాణలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మబలిదానం చేసుకున్నారు. తమ ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. తీవ్ర గాయాల పాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కార్వాన్‌లో ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టంచేశాయి. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. కొట్టాది సాధించుకుందామని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
    First published:

    Tags: Rtc, Rtc jac, Telangana, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు