news18-telugu
Updated: October 19, 2019, 5:37 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీచేసింది. వారిద్దరూ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని బీసీ కమిషన్ ఆదేశించింది. ఈ నెల 25న ఢిల్లీలో బీసీ కమిషన్ ముందు పూర్తి నివేదికతో హాజరుకావాలని ఆర్డర్ వేసింది. ఆర్టీసీ సమ్మెలో జోక్యం చేసుకోవాలని బీసీ కమిషన్ను ఆర్టీసీ జేఏసీ కోరింది. కార్మికుల్లో 20 వేలకు పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని కార్మికులు బీసీ కమిషన్కు తెలిపారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులను డిస్మిస్ చేశామని ప్రభుత్వం అంటోందని కార్మికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదుతో స్పందించిన బీసీ కమిషన్ సీఎస్, ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లతో 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం విధించిన గడువులోపు విధులకు చేరని వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల వద్ద వ్యాఖ్యానించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు బీసీ కమిషన్ను ఆశ్రయించారు.
జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 19, 2019, 5:27 PM IST