Home /News /telangana /

TSRTC STRIKE JAC LEADER ASHWATTHAMA REDDY SLAMS CM KCR SK

TSRTC Strike: ఆర్టీసీ మూసివేతకు కుట్ర.. కేసీఆర్‌పై జేఏసీ ఆగ్రహం

అశ్వత్థామరెడ్డి(ఫైల్ ఫోటో)

అశ్వత్థామరెడ్డి(ఫైల్ ఫోటో)

ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టిందని.. ఆర్టీసీ మూసివేతకు కుట్రలు జరుగుతున్నాయని జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు.

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కాకా రేపుతోంది. సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మికులు స్పష్టం చేస్తుంటే.. విధుల్లో చేరకుంటే ఉద్యోగులు పోతాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టిందని.. ఆర్టీసీ మూసివేతకు కుట్రలు జరుగుతున్నాయని జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఇందిరాపార్క్‌లో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన దీక్షలకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతివ్వాలని కోరారు.

  ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు, ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతోంది. 50వేల మంది సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బస్సులను తిప్పిందో లెక్కలు చూపాలి. సమ్మెను చీల్చాలని ప్రయత్నిస్తున్నారు. మేం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెను విరమించం. సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మాకు మద్దతు తెలిపుతున్నాయి.
  అశ్వత్థామరెడ్డి


  ఆర్టీసీ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాలని అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌కు అధికారులు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలుచేసి.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
  First published:

  Tags: CM KCR, Rtc, Telangana, Telangana News, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు