తెలంగాణంలో ఆర్టీసీ సమ్మె పదో రోజుకు చేరింది. ఇద్దరు కార్మికుల ఆత్మహత్యతో సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా విపక్షాలు రోడ్డెక్కాయి. ఇక సోమవారం ఆర్టీసీ జేఏసీ నాయకులు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను కలిశారు. ఆర్టీసీ సమ్మె, అనంతరం నెలకొన్న పరిణామాలను గవర్నర్కు వివరించారు. ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు జేఏసీ నేతలు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామరెడ్డి.. కార్మిక సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు.
ఇక సమ్మెపై టీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు మధ్య కేకే మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. తమకును ఆహ్వానిస్తే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తామని, టీఆర్ఎస్ హామీ ఇవ్వలేదన్న కేకే వ్యాఖ్యలను తప్పుబట్టారు. కరీంనగర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని చెప్పారని స్పష్టంచేశారు జేఏసీ నేతలు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.