TSRTC strike: ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు హైకోర్టు నోటీసులు..

సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సమ్మెపై వివరణ ఇవ్వాల్సిందిగా రెండు ఆర్టీసీ ఉద్యోగుల గుర్తింపు సంఘాలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు.

news18-telugu
Updated: October 6, 2019, 6:47 PM IST
TSRTC strike: ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు హైకోర్టు నోటీసులు..
తెలంగాణ హైకోర్టు
news18-telugu
Updated: October 6, 2019, 6:47 PM IST
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై దాఖలైన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. సమ్మె చట్టబద్ధం కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా హైకోర్టుకు తెలిపారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశామని వివరించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. న్యాయవాది వాదనలు విన్న హైకోర్టున.. తెలంగాణలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులపై ఈ నెల 10న నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సమ్మెపై వివరణ ఇవ్వాల్సిందిగా రెండు ఆర్టీసీ ఉద్యోగుల గుర్తింపు సంఘాలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు.

First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...