హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ జేఏసీకి మరో షాక్.. రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ జేఏసీకి మరో షాక్.. రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

5,100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగిస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది.

దాదాపుగా 50 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలకు మరో షాక్ తగిలింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలపైన రిట్ పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. 5,100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగిస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. ఏజీ వినిపించిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. మోటారు వాహనచట్టం-1988 సెక్షన్ 102 ప్రకారం రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వానికి విస్తృత అధికారాలున్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది హైకోర్టు. దాంతో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.

ప్రైవేట్ రూట్ల కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఆర్టీసీ భవితవ్యం, కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇటు కార్మికులు..అటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

గురువారం ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపడం ప్రభుత్వానికి తీవ్ర భారమని.. వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పుడున్న స్థితిలోనే ఆర్టీసీని యథావిధిగా కొనసాగిస్తే నెలకు రూ.640కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా వేశారు. ప్రతీ నెలా ఇంత భారీగా ఆర్టీసీపై వెచ్చించడం అసాధ్యమని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీపై రూ.5వేల కోట్ల అప్పులున్నాయని.. తక్షణం చెల్లించాల్సిన వాటిలో రూ.2వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు.

First published:

Tags: CM KCR, Telangana, Tsrtc privatization, TSRTC Strike

ఉత్తమ కథలు