హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రభుత్వం చెబుతున్నదొకటి... వాస్తవం మరొకటి... ఆర్టీసీ అడ్డగోలు దోపిడీ

ప్రభుత్వం చెబుతున్నదొకటి... వాస్తవం మరొకటి... ఆర్టీసీ అడ్డగోలు దోపిడీ

ప్రభుత్వం చెబుతున్నదొకటి... వాస్తవం మరొకటి... ఆర్టీసీ అడ్డగోలు దోపిడీ (credit - twitter - P Pavan)

ప్రభుత్వం చెబుతున్నదొకటి... వాస్తవం మరొకటి... ఆర్టీసీ అడ్డగోలు దోపిడీ (credit - twitter - P Pavan)

TSRTC Strike 3rd Day : అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ ఉద్యోగులూ... ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. ఐతే... వాళ్ల పంతాలు, సమస్యలతో చిక్కుల్లో పడుతున్నది మాత్రం ప్రజలే.

TSRTC Strike 3rd Day : తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నదానికీ... వాస్తవంలో జరుగుతున్నదానికీ ఏమాత్రం సంబంధం కనిపించట్లేదు. ప్రభుత్వం ఏమంటోంది... ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగినా... ప్రజలకు ఎలాంటి సమస్యలూ లేకుండా... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామనీ... 9వేలకు పైగా బస్సుల్ని నడిపామని చెబుతోంది. పైగా... అదనపు ఛార్జీలేవీ వసూలు చేయట్లేదనీ... ఎప్పటిలాగే... సాధారణ ఛార్జీలే బస్సుల్లో తీసుకుంటున్నారని అంటోంది. వాస్తవం మరోలా ఉంది. బస్సు ఎక్కితే చాలు... బలవంతపు దోపిడీ అమలవుతోంది. జస్ట్ రెండు కిలోమీటర్ల జర్నీకి కూడా రూ.15 నుంచీ రూ.20 తీసేసుకుంటున్నారు తాత్కాలిక కండక్టర్లు. అదేంటి... ఈ రూట్‌లో ఎప్పుడూ టికెట్ రూ.10 కదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తే... లేదు... డిపో మేనేజర్లు మమ్మల్ని అలాగే తీసుకోమంటున్నారు అని అంటున్నారు. ఇక సికింద్రాబాద్ లాంటి దూరపు జర్నీలకైతే... రూ.50 దాకా లాగేసుకుంటున్నారు. రూ.100 కాగితం ఇస్తే... రూ.50 చేతిలో పెట్టి... అంతే అంటున్నారు. ఎప్పుడూ తీసుకునేది రూ.20 కదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తే... స్పెషల్ బస్సులు అంటూ నాటకాలాడుతున్నారు. టికెట్  ఎలాగూ ఇవ్వట్లేదు కదా అని... ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వేరే ప్రయాణ వాహనాలు లేకపోవడంతో... అడ్డంగా బుక్కైపోయి... డబ్బులు నష్టపోతున్నారు ప్రయాణికులు.

పాసులు ఉన్నా వేస్టే : తెలంగాణలో ఎంతో మంది బస్ పాస్‌లు ఉన్నవారికి ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి. బస్ ఎక్కగానే పాస్‌లు చెల్లవని అంటున్నారు తాత్కాలిక ఆర్టీసీ ఉద్యోగులు. అదేమని అడిగితే... డిపో మేనేజర్లు మాతో అలాగే చెప్పారు అంతే అంటూ ప్రయాణికుల్ని కిందకు దించేస్తున్నారు. పాస్ ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే రెండ్రోజులుగా బస్ పాస్‌లు ఉన్నా... టికెట్లు కొనుక్కొని... ఒక్కో ప్రయాణికుడూ... దాదాపు రూ.100 దాకా నష్టపోతున్నారు. ప్రభుత్వం మాత్రం అంతా సూపర్ అంటోంది.

ఇక దసరా పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్లే వాళ్ల సంగతి చెప్పుకోవడమే వేస్ట్. వాళ్లపై జరుగుతున్న దోపిడీకి మాటలు సరిపోని పరిస్థితి. జస్ట్ 200 కిలోమీటర్ల దూరానికి కూడా రూ.500 నుంచీ రూ.1000 దాకా లాగేస్తున్నారు. వస్తే రండి... లేదంటే లేదని అంటుంటే... ఏం చెయ్యాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. ప్రభుత్వాలు, ఆర్టీసీ ఉద్యోగులకూ మధ్య ఉన్న పంతాలతో... ప్రజలెందుకు ఇబ్బందులు పడాలన్న ప్రశ్నకు సమాధానం లేదు.

Published by:Krishna Kumar N
First published:

Tags: Telangana News, Telangana updates, TSRTC Strike

ఉత్తమ కథలు