విధుల్లోకి తీసుకోం...ఆర్టీసీ కార్మికులకు సర్కార్ షాక్

సమ్మె విరమిస్తూ జేఏసీ విడుదల చేసిన లేఖపై ఆర్టీసీ ఎండీ కార్యాలయం తిప్పి పంపినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, తాము స్ట్రైక్ కాల్ ఆఫ్ నోటీసు తీసుకోవడం లేదని తెలిపింది.

news18-telugu
Updated: November 25, 2019, 7:38 PM IST
విధుల్లోకి తీసుకోం...ఆర్టీసీ కార్మికులకు సర్కార్ షాక్
అశ్వత్థామరెడ్డి
  • Share this:
సమ్మె విరమిస్తూ ఆర్టీసీ జేఏసీ విడుదల చేసిన లేఖను ఆర్టీసీ ఎండీ కార్యాలయం తిప్పి పంపింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, తాము స్ట్రైక్ కాల్ ఆఫ్ నోటీసు తీసుకోవడం లేదని తెలిపింది. అంతేకాదు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కార్మికులపై ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని, జేఏసీ ప్రకటన  హస్యాస్పదంగా ఉందని అసహనం వెల్లిబుచ్చారు. పండగ రోజుల్లో అనాలోచితంగా నిర్ణయం తీసుకున్నారని ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారని అన్నారు. రేపు ఉదయం డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని, కట్టుదిట్టమైన పోలీసుల భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు లేబర్ కోర్టు నిర్ణయం వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని ఎండీ సునీల్ శర్మ తెలిపారు.

ఇదిలా ఉంటే,  52 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. సమ్మెపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, అటు కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ఏకపక్షంగా ప్రకటించారు. అంతేకాదు మంగళవారం నుంచి కార్మికులందరూ విధులకు హాజరవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు.
Published by: Krishna Adithya
First published: November 25, 2019, 7:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading