ఐదో రోజు ఆర్టీసీ సమ్మె... నేడు ప్రభుత్వం, ఉద్యోగులు, అఖిలపక్షాల వేర్వేరు భేటీలు

TSRTC Strike 5th Day : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను వ్యతిరేకించిన ప్రభుత్వం... పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అటు ఉద్యోగుల జేఏసీ నెక్ట్స్ ఏం చెయ్యాలో ఇవాళ తేల్చనుంది.

news18-telugu
Updated: October 9, 2019, 6:04 AM IST
ఐదో రోజు ఆర్టీసీ సమ్మె... నేడు ప్రభుత్వం, ఉద్యోగులు, అఖిలపక్షాల వేర్వేరు భేటీలు
ఐదో రోజు ఆర్టీసీ సమ్మె (credit - Twitter - Som Panda)
  • Share this:
TSRTC Strike 5th Day : తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె శుక్రవారం అర్థరాత్రి మొదలైంది. నేటికి ఐదో రోజు. తమ డిమాండ్లు నెరవేర్చాల్సిందే అంటూ... 52 వేల మంది సమ్మెకు దిగడంతో... తెలంగాణలో రవాణా స్థంభించింది. ఐతే... ప్రభుత్వం మాత్రం... దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్ని ఆర్టీసీ నుంచీ తొలగించామనీ... కొత్త రిక్రూట్‌మెంట్లు చేస్తున్నామని చెబుతోంది. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ప్రభుత్వం సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు ఏం చెయ్యాలనే అంశంపై ఇవాళ చర్చలు జరపనుంది. ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయి వాస్తవ పరిస్థితిని వివరిస్తారు. వాళ్లు చెప్పేదాన్ని బట్టీ నెక్ట్స్ ఏం చెయ్యాలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది.

ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందంటున్న ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఇవాళ సమావేశం కాబోతోంది. సకల జనుల సమ్మె సమయంలోనే ఏ ఉద్యోగినీ తొలగించనప్పుడు... సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలగించడమేంటని జేఏసీ మండిపడుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏం చెయ్యాలో ఇవాళ్టి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అలాగే లీగల్ నోటీసులను ఎలా ఎదుర్కోవాలో కూడా చర్చించనుంది జేఏసీ.

ఇప్పటివరకూ ఆర్టీసీ అంశం ప్రభుత్వం, ఉద్యోగుల మధ్యే ప్రధానంగా నడవగా... ఇవాళ్టి నుంచీ ప్రతిపక్షాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల్ని తొలగించడంపై కాంగ్రెస్ భగ్గుమంది. ఇవాళ అఖిలపక్ష నేతలు సమావేశమై... ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించనున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం ఏం చెయ్యాలో కొన్ని ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

సరిగ్గా దసరా వచ్చినప్పుడే సమ్మె జరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లు డబుల్, ట్రిపుల్ ఛార్జీలు చెల్లించి వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా ప్రస్తుతం నడుస్తున్న బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. బస్ పాస్‌లు కూడా చెల్లవని చెబుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పుడు సొంత ఊళ్ల నుంచీ తిరిగి ప్రజలు హైదరాబాద్‌కి వచ్చే పరిస్థితి ఉంటుంది. వారికి సరైన రవాణా సదుపాయాలు లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. స్కూళ్లు కూడా మొదలవ్వబోతున్నాయి. ఈ పరిస్థితులు ప్రభుత్వానికి మరింత ఇబ్బంది కలిగించే అవకాశాలున్నాయి.

 

Pics : ఎద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నిధి అగర్వాల్ఇవి కూడా చదవండి :

Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

Health Tips : స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading