నేటి నుంచీ ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు

TSRTC Strike 43rd Day : ఓవైపు సమ్మె కొనసాగిస్తూనే... విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గడంతో... ప్రభుత్వం కూడా చర్చల దిశగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

news18-telugu
Updated: November 16, 2019, 5:38 AM IST
నేటి నుంచీ ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
TSRTC Strike 43rd Day : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే డిమాండ్‌ని పక్కన పెట్టినా... తమ ఆందోళనల విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. నిన్న 42వ రోజు సమ్మెలో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు జరిపిన కార్మికులు... ఇవాళ్టి నుంచీ ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్షలు చేపట్టబోతున్నారు. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా... దీక్షలు చేసితీరతామంటున్నారు. ఐతే... శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటున్న పోలీసులు... దీక్షలకు అనుమతించే ప్రసక్తి లేదన్నారు. దీక్షకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. పోలీసులు గనక బలవంతంగా తరలిస్తే... ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో దీక్షలు చేయాలన్న ప్లాన్ బీ కూడా కార్మికుల దగ్గర ఉన్నట్లు తెలిసింది.

ఆర్టీసీ ఓ మెట్టు దిగడంతో... ప్రభుత్వం చర్చలకు తమను ఆహ్వానిస్తుందని జేఏసీ భావిస్తోంది. మిగిలిన 25 డిమాండ్లపై చర్చించాలని కోరుతోంది. ఐతే... దీనిపై ప్రభుత్వం తాజాగా ఎలాంటి సంకేతాలూ ఇవ్వలేదు. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్మికులు మాత్రం పాజిటివ్ కోణంలో ఆలోచిస్తూ... సమ్మె కొనసాగిస్తూ... ప్రభుత్వ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో... ఆర్టీసీ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డిపై అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ నమోదైంది. ఆయనతో పాటు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిపై మాల మహానాడు అధ్యక్షుడు దీపక్ కుమార్ కంప్లైంట్ చేశారు. ఇప్పటివరకూ ఉద్ధృతంగా సాగిన సమ్మెను... జేఏసీ నేతలు తమ స్వప్రయోజనాల కోసం నీరు గార్చుతున్నారని దీపక్ కుమార్ ఆరోపించారు. 23 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నాక... విలీనం డిమాండ్‌పై ఎందుకు వెనక్కి తగ్గుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Pics : ఫ్యాషన్‌కి కొత్త అర్థం చెబుతున్న రెహనా బషీర్ఇవి కూడా చదవండి :

Health Tips : ఎముకలను దృఢంగా మార్చే టీ... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : పీచ్ ఫ్రూట్ తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...


Health Tips : రోజూ 4 బాదం పప్పులు తినండి... మీలో వచ్చే మార్పులు ఇవీ...


పార్టీ టైమ్... హ్యాంగోవర్ అదుపులోకి రావాలంటే...

Published by: Krishna Kumar N
First published: November 16, 2019, 5:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading