హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తాజా ప్రకటన...

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తాజా ప్రకటన...

TSRTC Strike 32nd Day : ఆర్టీసీ ఉద్యోగులకు మూడ్రోజుల కిందట నవంబర్ 5ను డెడ్ లైన్‌గా విధించిన సీఎం కేసీఆర్... ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. మరి కార్మికులు విధుల్లో చేరతారా?

TSRTC Strike 32nd Day : ఆర్టీసీ ఉద్యోగులకు మూడ్రోజుల కిందట నవంబర్ 5ను డెడ్ లైన్‌గా విధించిన సీఎం కేసీఆర్... ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. మరి కార్మికులు విధుల్లో చేరతారా?

TSRTC Strike 32nd Day : ఆర్టీసీ ఉద్యోగులకు మూడ్రోజుల కిందట నవంబర్ 5ను డెడ్ లైన్‌గా విధించిన సీఎం కేసీఆర్... ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. మరి కార్మికులు విధుల్లో చేరతారా?

  TSRTC Strike 32nd Day : తెలంగాణలో నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు... తిరిగి విధుల్లో చేరడానికి నేడే చివరి రోజు. ఇవాళ అర్థరాత్రి లోపు... బేషరతుగా విధుల్లో చేరకపోతే... ఇక ఉద్యోగాలు పోయినట్లే. విధుల్లో చేరని వాళ్లను తప్పించేయాలని నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటన చేశారు. ఎప్పుడో విధుల్లోంచీ తప్పించాల్సి ఉన్నా... పోనీలే అని మరో ఛాన్స్ ఇచ్చామంటున్న కేసీఆర్... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులదే అంటున్నారు. తిరిగి విధుల్లో చేరిన వారికి అన్ని రకాల రక్షణ సదుపాయాలూ ఉంటాయనీ, అదే విధుల్లో చేరకపోతే మాత్రం ఇక ప్రభుత్వం వాళ్లను పట్టించుకోదని తేల్చి చెబుతోంది ప్రభుత్వం. విధుల్లో చేరకపోతే... తమ కుటుంబమే రోడ్డున పడుతుందంటున్న సర్కార్... అనవసరంగా యూనియన్ పెద్దలు చెప్పే మాటలు నమ్మొద్దనీ, విధుల్లో చేరిపోమనీ కోరుతోంది. ఇవాళ రాత్రిలోగా కార్మికులు చేరకపోతే, 5000 రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలనీ, అప్పుడు తెలంగాణలో ఇక పూర్తిస్థాయి ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె, సమ్మె విషయంలో హైకోర్టు విచారణ ఈ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో తాజాగా సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

  సమ్మె విషయంలో, కోర్టు విచారణ సందర్భంగా ఏం చెయ్యాలో కేసీఆర్ చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాల్ని, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు. ప్రస్తుత ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ విధుల్లో చేరడానికి ప్రభుత్వం మూడు రోజుల గడువు ఇచ్చింది. నేటి అర్థరాత్రి గడువు ముగిసే సరికి విధుల్లో చేరకపోతే... బుధవారం లేదా... గురువారం 5000 రూట్లకు ప్రైవేట్ పర్మిట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

  కోర్టుకు అంత సీన్ లేదు? : ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తేలిగ్గా తీసుకుంటోంది. అసలు ఈ విషయంలో కోర్టులు తమను ఏమీ చెయ్యలేవన్నది సీఎం కేసీఆర్ అభిప్రాయంగా తెలుస్తోంది. నవంబర్ 7 (గురువారం)న హైకోర్టులో ఆర్టీసీ సమ్మె పిటిషన్ విచారణకు రానుంది. ఐతే... కోర్టు తీర్పు తమకు అనుకూలంగా లేకపోతే... ఈ విషయంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. అదే జరిగితే... తమకు ఎలాంటి నష్టం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టులో కేసుల విచారణ ఆలస్యం అవుతుంది కాబట్టి... నెలల తరబడి ఎదురుచూడటం ఆర్టీసీ కార్మికులకు కష్టమే అంటున్న ప్రభుత్వం... ఏం చేసుకుంటారో చేసుకోమని ఆర్టీసీ జేఏసీకి సవాల్ విసురుతోంది.


  Pics : అందాల తమిళ పొన్ను ఐశ్వర్య మీనన్ క్యూట్ స్టిల్స్


  ఇవి కూడా చదవండి :

  నేడు తెలంగాణ బంద్?... నాగోలులో తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు

  మద్యం కొద్దికొద్దిగా తాగితే కలిగే లాభాలేంటి?

  Bigg Boss 3 | శ్రీముఖికి ప్లస్సా, మైనస్సా?

  డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

  Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు

  First published:

  Tags: Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు