హోమ్ /వార్తలు /తెలంగాణ /

కేసీఆర్ లెక్క తప్పింది... అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో...

కేసీఆర్ లెక్క తప్పింది... అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో...

 సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

TSRTC Strike 30th Day : ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆర్టీసీ జేఏసీ లైట్ తీసుకుంది. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపింది.

  TSRTC Strike 30th Day : సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులు మూడు రోజుల్లో తిరిగి విధుల్లో చేరాలన్నది తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా విధించిన డెడ్ లైన్. ఆర్టీసీ సమ్మెపై కేబినెస్ సమావేశంలో చర్చించిన కేసీఆర్... కొన్ని కీలక ప్రకటనలు చేసిన విషయం మనకు తెలుసు. వాటిలో ఒకటి... 5వేల బస్సులు ప్రైవేట్‌కీ, మరో 5వేల బస్సులు ఆర్టీసీకి అన్న కండీషన్. సరే ఆయన లెక్క ప్రకారమే చేస్తారని అనుకుంటే... మరి బస్ పాస్‌లు తీసుకున్నవారి పరిస్థితి ఏంటన్నది తేలాల్సిన అంశం. ఇప్పటివరకూ ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు పెద్దగా లేవు కాబట్టి... బస్ పాస్‌లు తీసుకున్నవారికి ఎక్కువ బస్సులు అందుబాటులో ఉండేవి. ఒకవేళ 5వేల బస్సులు ప్రైవేట్‌కి ఇస్తే... బస్ పాస్‌లు తీసుకున్నవారికి... బస్సుల కొరత ఏర్పడుతుంది. దాదాపు 50 శాతం బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని వాళ్లు కోల్పోతారు. సగం సేవలు తగ్గిపోయినట్లే కాబట్టి... బస్ పాస్‌ల రేట్లను సగానికి తగ్గించమని డిమాండ్ చెయ్యలేని పరిస్థితి. పోనీ ఆర్టీసీ బస్సుల కోసం ఓ పాస్, ప్రైవేట్ బస్సుల కోసం మరిన్ని పాస్‌లు తీసుకునే పరిస్థితి లేదు. మరి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదన్నది చర్చనీయాంశమవుతోంది.

  ప్రస్తుతం హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో... విద్యార్థులు, దివ్యాంగులు, ఉద్యోగులు, మీడియా జర్నలిస్టులు... ఇలా చాలా మంది బస్ పాస్‌లు కలిగివున్నారు. ఆర్టీసీలో సగం బస్సుల్ని ప్రైవేటీకరిస్తే... వీరంతా ఇబ్బందులు పడాల్సిందే. పోనీ అసలు బస్ పాసే లేకుండా ఏ బస్ ఎక్కితే, ఆ బస్సులోనే టికెట్ తీసుకుందామని అనుకుంటే... ప్రతి రోజూ చిల్లర సమస్య తప్పదు. కండక్టర్లు చిల్లర ఇవ్వాలని కోరడం, ప్రయాణికులు చిల్లర లేదని చెప్పడం, టికెట్ వెనక కండక్టర్ ఇవ్వాల్సిన చిల్లర రాయడం, బస్సు దిగేటప్పుడు ఆ చిల్లర తిరిగి తీసుకోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడటం ఇలాంటివి కామనవుతాయి. అందువల్ల పాస్ కలిగివుండటమే బెటరన్నది ఎక్కువ మంది చెప్పేమాట. బస్సుల్ని ప్రైవేటీకరిస్తే మాత్రం బస్ పాస్ వేస్టే అన్న వాదన వినిపిస్తోంది.

  ప్రైవేట్ బస్ ఆపరేటర్లు బస్ పాస్‌లను అనుమతించరు. సీఎం కేసీఆర్... బస్ పాస్‌లు అందరికీ కొనసాగుతాయనీ... ఎవరికీ పాస్‌లను ప్రభుత్వం రద్దు చేయదని తాజా ప్రెస్‌మీట్‌లో తెలిపారు. కానీ... ప్రైవేట్ బస్సుల్లో కూడా అదే బస్ పాస్ చెల్లుతుందని చెప్పలేదు. అలా చెల్లితే... ఏ సమస్యా ఉండదు. ఇందుకు ప్రైవేట్ ఆపరేటర్లు ఒప్పుకుంటారన్న గ్యారెంటీ లేదు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

  సమ్మె వల్ల నరకం చూస్తున్న ప్రయాణికులు : కేసీఆర్ తాజా ప్రెస్‌మీట్‌పై ఆర్టీసీ జేఏసీ భగ్గుమంటోంది. ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని స్పష్టం చేసింది. ఐతే... నెల రోజులుగా (నేడు 30వ రోజు) జరుగుతున్న ఈ సమ్మె వల్ల ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఉదయాన్నే బస్సులు ఉండట్లేదు. ఉదయం 8 గంటల తర్వాతే బస్సులు తిరుగుతున్నాయి. అవి కూడా కొన్నే. అందువల్ల ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. పోనీ ఏ క్యాబులో, ఆటోలో ఆశ్రయిస్తే... అడ్డంగా ఛార్జీలైపోతున్నాయి. ఫలితంగా నెలకు అదనంగా రూ.2 నుంచీ రూ.3 వేల దాకా ఖర్చయ్యే పరిస్థితి. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే 33 లక్షల మంది ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇన్ని రోజులు సమ్మె జరుగుతుంటే ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదనీ, ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించట్లేదని ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు.

  జనరల్‌గా హైదరాబాద్‌లో 3,850 బస్సులు దాదాపు 15 వేల ట్రిప్పులు తిరుగుతాయి. అప్పటికీ మరో 3000 బస్సులు అవసరం. సమ్మె వల్ల రోజుకు 1500 బస్సులకు మించి తిరగట్లేదు. అవి కూడా చాలా తక్కువ ట్రిప్పులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లొచ్చే వారికి ఆ టైమ్‌లో బస్సుల కొరత బాగా ఉంటోంది. ఉదయం 4 గంటల నుంచే తిరగాల్సిన బస్సులు... 7 లేదా 8 గంటల తర్వాతే తిరుగుతున్నాయి. రాత్రి 12 గంటల దాకా తిరగాల్సిన బస్సులు... 10 గంటలకే డిపోకి వెళ్లి ముసుగేసుకుంటున్నాయి. ఇలాగైతే ఎలా అని ప్రశ్నిస్తున్న ప్రయాణికులకు సమాధానం దొరకట్లేదు. ఈ సమ్మె ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో, ఎన్నాళ్లు ఇలా ఇబ్బంది పడాలో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


  Pics : హార్డ్‌వర్క్‌తో స్టార్‌డమ్ తెచ్చుకున్న ఏంజెలికా క్యూట్ ఫొటోస్


  ఇవి కూడా చదవండి :

  నేడే లాంగ్ మార్చ్... సిద్ధమైన జన సైనికులు... ఇసుక తుఫానేనా?

  Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


  Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

  Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు


  Health Tips : బరువు తగ్గాలా... అలోవెరాతో ఇలా చెయ్యండి...

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Telangana News, Telangana update, Telangana updates, TSRTC Strike

  ఉత్తమ కథలు