RTC Strike : ఆర్టీసీ సమ్మెపై నేడు మళ్లీ విచారణ... హైకోర్టు ఏం చెబుతుంది?

TSRTC Strike 25th Day : ఓవర్ నైట్‌లో విలీనం సాధ్యమేనా అని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించడంతో... ఆర్టీసీ కార్మికులు టెన్షన్‌లో ఉన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందేమోనని కంగారు పడుతున్నారు.

news18-telugu
Updated: October 29, 2019, 5:54 AM IST
RTC Strike : ఆర్టీసీ సమ్మెపై నేడు మళ్లీ విచారణ... హైకోర్టు ఏం చెబుతుంది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
TSRTC Strike 25th Day : తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందనేది ఆసక్తిగా మారింది. హైకోర్టు ఏం చెబుతుందనే దానిపై కార్మిక సంఘాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమ్మెపై సోమవారం కొంతవరకూ విచారించిన హైకోర్టు... కొన్ని అంశాల కారణంగా... విచారణను మంగళవారానికి (నేటికి) వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం బుధవారం వరకూ గడువు కోరినా... అంత సమయం ఇచ్చేందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు ఆదేశాలపై ఇవాళ యూనియన్ సభ్యులు 12 గంటలకు సమావేశమై చర్చించనున్నారు. ఎలా ముందుకు వెళ్లాలి... ఏయే అంశాలపై పట్టుపట్టాలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే హైకోర్టుకు ఇవాళ ఏం చెప్పాలో డిసైడ్ చేసుకోనున్నారు.

ఇక రేపటి తెలంగాణ సకల జనుల సభ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ బంద్ ఎంత చక్కగా చేశామో... సభను కూడా అదే రేంజ్‌లో చేసి... ప్రభుత్వానికి తమ పోరాట పటిమను చూపించాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు.

ఆర్టీసీ సమ్మెపై సోమవారం హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్... ఆర్టీసీ విలీనంతో పాటు అన్ని అంశాల మీదా చర్చించాల్సిందేనని యూనియన్లు పట్టుపట్టాయని, కోర్టు చెప్పిన ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదని కోర్టుకు తెలిపారు. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటకు వెళ్లిపోయారని కోర్టుకు ఏఏజీ విన్నవించారు. దీంతో విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగిలిన అంశాలపై చర్చించాలని ఆర్టీసీ యూనియన్లకు హైకోర్టు సూచించింది. రాత్రికి రాత్రి విలీనం కావాలంటే ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించింది. అయితే హైకోర్టు ఆదేశాలను అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని యూనియన్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. మొత్తం 45 డిమాండ్లలో ఆర్థిక భారం కాని వాటిపై చర్చించాలని తాము ఆదేశించినట్టు న్యాయమూర్తి తెలిపారు.




Pics : తైవాన్ బ్యూటీ జాంగ్ వాన్‌యంగ్ క్యూట్ ఫొటోస్




ఇవి కూడా చదవండి :

Health Tips : మంట, నొప్పులను తరిమికొట్టే 7 అద్భుత ఆహారాలు

Health Tips : రోజూ 30 నిమిషాలు నడిస్తే...మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..


Health Tips : నిమ్మకాయ తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు... ఇలా చెయ్యండి...

Health Tips : ఒక రోజులో ఎంత పసుపు వాడితే మంచిదో తెలుసా?
Published by: Krishna Kumar N
First published: October 29, 2019, 5:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading