news18-telugu
Updated: October 20, 2019, 2:11 PM IST
ప్రతీకాత్మక చిత్రం
TSRTC Strike 17th Day : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య సోషల్ మీడియాలో కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. RTC వాళ్లకు సెలవులు ఉన్నాయా, RTC కార్మికులు 20, 30 సంవత్సరాల నుంచీ ఉద్యోగం చేస్తున్న వారికి 40, 50వేల జీతాలు ఉన్నాయని నిరూపించగలరా అని ఓ డ్రైవర్ ప్రశ్నించారు. అసలు ఆర్టీసీలో టైమింగ్ అంటూ ఉందా అని నిలదీశారు. ఆదివారం, రెండో శనివారం, పండుగ సెలవుల్ని తాము తీసుకున్నట్టు ప్రభుత్వం నిరూపించగలదా అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చెయ్యాలని చూస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకొని తీరతామని ఆ డ్రైవర్ తెలిపారు. ఆర్టీసికి దాదాపు రూ.80వేల కోట్ల ఆస్తులు ఉన్నాయన్న ఆ డ్రైవర్... ప్రైవేట్ పరం చేస్తే... ఆ ఆస్తులు ఎవరికి చెందుతాయని ప్రశ్నించారు.
తమ కరీంనగర్ RTC బస్టాండ్‌కి దాదాపు 22 ఎకరాలు ఉన్నాయన్న ఆ డ్రైవర్... కరీంనగర్ RTC వర్క్ షాప్‌కి దాదాపుగా 54 ఎకరాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇవన్నీ ప్రజలకు తెలుసన్నారు. ఇలా తెలంగాణలోని 33 జిల్లాల్లో ఆర్టీసీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయో ప్రజలు ఆలోచించగలరని అన్నారు. ఆర్టీసీ మనదన్న ఆ డ్రైవర్... దాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసికి రూ.3వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న ఆ డ్రైవర్... ప్రభుత్వం తమకు రాయితీ రూపంలో చెల్లించాల్సినవి రూ.2200 కోట్లకు పైనే అని గుర్తుచేశారు.
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే... ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లు ఛార్జీలు వసూలు చేస్తారన్న వాస్తవం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించిన ఆ డ్రైవర్... ప్రైవేట్ ట్రావెల్స్... తమకు లాభాలు వచ్చే రూట్లలోనే బస్సుల్ని నడుపుతాయనీ... నష్టాలు వచ్చే పల్లెల్లో బస్సులు నడపరన్న విషయం ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదని నిలదీశారు. ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు... బస్సు నిండేవరకూ కదలకుండా... టైమ్ అయిపోతున్నా... అలాగే ప్రయాణికుల్ని వెయిట్ చేయిస్తారన్న విషయాన్ని గుర్తుచేశారు.
ఆర్టీసీ ప్రైవేట్ పరం అయితే... పల్లెలకు వెళ్లాలంటే... బస్సులు ఉండవనీ, ఆటోలు, జీపులే దిక్కవుతాయనీ... దీని వల్ల ప్రయాణికులకు చాలా ఖర్చులు అవుతాయనీ ఆ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయన్న ఆయన... ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని... ఆర్టీసీని కాపాడాలని కోరారు. ఆర్టీసీ మనుగడ కోసమే తాము సమ్మె చేస్తున్నామని అన్న ఆ డ్రైవర్... ప్రజలు అర్థం చేసుకొని తమకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది దీన్ని షేర్ చేస్తున్నారు. తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
Pics : సొగసుల సుందరి షిరిన్ కంచవాలా క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :జొమాటోకి రూ.లక్ష ఫైన్... కారణం ఇదీ...
భారీ చేపను నీటిలో వదిలేసిన చిన్నారి... నెటిజన్ల ప్రశంసలు... వైరల్ వీడియో
వీళ్లంతా యూరప్‌లో మోస్ట్ వాంటెడ్ వుమెన్... చేసిన నేరాలు ఇవీ...
మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది... లెక్కతేల్చిన పురావస్తు తవ్వకాలు
Published by:
Krishna Kumar N
First published:
October 20, 2019, 2:11 PM IST