నెక్ట్స్ ఏంటి... ఇవాళ తేల్చనున్న ఆర్టీసీ జేఏసీ

TSRTC Strike 17th Day : తెలంగాణ బంద్ ఉద్ధృతంగా జరగడంతో ఆర్టీసీ జేఏసీ ఒకింత ఓదార్పు పొందినట్లు ఫీలైంది. నెక్ట్స్ ఏమైనా జరగొచ్చని అంటోంది. ప్రభుత్వానికి ఇది షాకింగ్ ప్రకటనే.

news18-telugu
Updated: October 20, 2019, 5:48 AM IST
నెక్ట్స్ ఏంటి... ఇవాళ తేల్చనున్న ఆర్టీసీ జేఏసీ
Video : పోలీస్ భద్రతతో కదిలిన బస్సు.. అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు (File)
news18-telugu
Updated: October 20, 2019, 5:48 AM IST
TSRTC Strike 17th Day : ప్రజలకు కోపం వస్తే తిరగబడతారన్న హైకోర్టు వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ... ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి హెచ్చరికలు చేసింది. సమ్మె మొదలై 16 రోజులు పూర్తైనా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం, హైకోర్టు సూచనల్ని కూడా పక్కన పెట్టి, చర్చల అంశాన్ని అటకెక్కించడంతో... ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. భవిష్యత్తులో జరిపే ఆందోళనల వల్ల ప్రజలు ఇబ్బంది పడితే... దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. సోమవారం నుంచీ సమ్మె మరింత ఉద్ధృతమవుతుందని తెలిపారు. 23న ఉస్మానియా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభకు వెళ్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు... తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే బంద్ విజయవంతం అయ్యిందని ప్రకటించారు.

ఇవాళ ఏం చేస్తారంటే : ఆర్టీసీ ఉద్యోగులు ఆదివారం ప్రజలకు గులాబీలు ఇచ్చి... ఆర్టీసీ ప్రాముఖ్యత, అవసరాన్ని వివరిస్తారు. అలాగే ఉదయం 11.30కి సుందరయ్య భవన్‌లో రాజకీయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశం అవుతారు. ఇప్పటివరకూ సమ్మె ఎలా జరిగింది? ఇకపై ఎలా జరగాలి అన్నదానిపై చర్చిస్తారు. కొత్త కార్యాచరణ రెడీ చేసుకోనున్నారు. ఐతే... ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచీ అలాంటి సంకేతాలేవీ కనిపించట్లేదు. బంద్ సందర్భంగా... జరిగిన అరెస్టులు, రాసిన కేసుల్ని బట్టీ... ప్రభుత్వం కఠినంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.

ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వని ప్రభుత్వం... అద్దె బస్సులకు కూడా ఇవ్వాల్సిన అద్దె ఇవ్వలేదు. సెప్టెంబర్‌కి చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించలేదు. మా సంగతేంటని అద్దె బస్సుల యజమానులు అడుగుతున్నారు. సమ్మె వల్ల తమకు డబ్బులు ఆపేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో మొత్తం 10,460 బస్సులు ఉన్నాయి. వీటిలో అద్దె బస్సులు 2103 ఉన్నాయి. కొత్త బస్సులకు బదులు ప్రభుత్వం ప్రైవేట్ బస్సులకు అద్దె చెల్లిస్తూ నడిపిస్తోంది. ఒక్కో బస్సుకూ నెలకు రూ.లక్ష దాకా చెల్లిస్తోంది. ఆ లెక్కన మొత్తం రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడా మనీ చెల్లించకపోవడంతో తాము తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కుదరట్లేదని ఆపరేటర్లు చెబుతున్నారు.

 


Pics : జబర్దస్త్ రష్మి లాగా కనిపించే కేరళ బ్యూటీ ఫొటోస్...
ఇవి కూడా చదవండి :
Loading...
Health Tips : కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...