TSRTC Strike 14th Day : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండు వారాలుగా జరుగుతోంది. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ జేఏసీ పట్టుదలలకు పోతుండటంతో... ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ హైకోర్టు ఏం చెబుతుందన్నది చర్చనీయాంశం. నిజానికి హైకోర్టు నేటికల్లా ఏదో ఒక పరిష్కారం చూడాలని ప్రభుత్వానికి సూచించింది. కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పరిష్కారం లభించలేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చర్చలకు పిలిస్తేనే తమ సమస్యలు చెప్పగలమనీ, తద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ కార్మిక జేఏసీ అంటోంది. హైకోర్టు సూచించినా కార్మికులకు ప్రభుత్వం సెప్టెంబర్ వేతనాలు ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కొంత మంది గుండెపోటుతో మృతి చెందారు. మరికొందరు ఆందోళనలు, అనారోగ్యాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఇవాళ గనక పరిష్కారం దిశగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వకపోతే... రేపు తెలంగాణ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ ముందుగానే ప్రకటించింది.
ప్రజల ఇబ్బందులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రైవేట్, తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నామని చెబుతున్నా... వాస్తవంలో అవి ఏమాత్రం సరిపోవట్లేదు. ఉన్న కొద్దిపాటి బస్సుల్లో ప్రజలు కిక్కిరిసిపోతున్నారు. ఫలితంగా బస్సు ఎక్కడం, దిగడం కూడా కష్టమైపోతోంది చాలా మందికి. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ ఆపరేటర్లు రేట్లను బాగా పెంచేస్తున్నారు. క్యాబ్ సర్వీసులు కూడా డిమాండ్-సప్లై ఆధారంగా రేట్లను పెంచేశాయి. ఇక తాత్కాలిక డ్రైవర్లకు అంతగా అనుభవం లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఏకంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణం. అసలు సరైన బస్సు సౌకర్యాలే లేవు. గ్రామాల నుంచీ సిటీలకు ప్రజలు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. రవాణా స్థంభించిపోతుంటే... కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఏం చెబుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
Pics : సెలబ్రిటీ స్టైలిస్ట్ సృష్టి ముంకా క్రియేటివ్ డిజైన్స్
ఇవి కూడా చదవండి :
Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి
Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు
Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు
Health Tips : టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...
Health Tips : పార్కులో 20 నిమిషాలు నడవండి... ఎంతో ఆరోగ్యం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.