ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు కార్మికుల ప్రయోజనాలతో పాటు ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సును ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజల వద్దకే బస్సులు అనే విధంగా ప్రచారాన్ని మొదలు పెట్టారు. జాతరలు, పంక్షన్లు, పెళ్లీలు ఇలా ఏ ప్రయాణామైన తామున్నమంటూ ఆర్టీసీ ముందుకు వస్తోంది. బస్సులను ప్రయాణికుల ఇంటివద్దకే పంపే ఏర్పాట్లను చేశారు. ఇలా ఆర్టీసీ ఆదాయంతో పాటు శివరాత్రి పర్వదినాన మరోసారి స్పెషల్ ఆఫర్ ప్రకటించారు.
శివరాత్రి సంధర్బంగా ఇంటివద్దకే బస్సు ప్రయాణికుల సంతృప్తే లక్ష్యంగా ఆర్టీసీ సేవలు అనే క్యాప్షన్ తో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యంగా ప్రత్యేక పర్వదినాలతో పాటు సాధారణ రోజుల్లో కూడా కేవలం ముప్పై మంది ప్రయాణికులు ఉంటే వారి వద్దకే బస్సును పంపే ఏర్పాట్లు చేసినట్టు ఆయన చెప్పారు. ఇక రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లేవారు తెలంగాణ ఆర్టీసీ బస్సును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Adilabad : అడవి మంత్రి జిల్లాలోనే వానరాల హల్చల్.. పట్టిస్తే..రూ.500 ..
కాగా ఆర్టీసీ బస్సు సేవల కోసం కాల్ సెంటర్ నంబర్ 040 30102829 లో లేదా స్థానిక డిపో మేనేజరు సంప్రదించవచ్చని ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా ఇటివలే సమ్మక్క జాతరకు కూడా ఇలా ఇంటివద్దకే ఆర్టీసీ బస్సును ప్రవేశపెట్టిన తాజాగా ఆ ఆఫర్ను నిత్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయంతోపాటు ప్రయాణికులు భద్రత కూడా ఉండేందుకు అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.