హోమ్ /వార్తలు /తెలంగాణ /

టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. నేటి నుంచి ఛార్జీల తగ్గింపు..

టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. నేటి నుంచి ఛార్జీల తగ్గింపు..

ఐదు కిలోల లోపు బరువు ఉన్న ఛార్జీలు, ఆరు నుంచి పది కిలోల లోపు బరువు ఉన్న పార్శిల్‌కు నేటి నుంచి వేర్వేరుగా ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.

    కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల సౌలభ్యం కోసం కొరియర్, పార్శిల్ సేవల ఛార్జీలను తగ్గించింది. అయితే ఈ కొత్త ఛార్జీలు జూలై 22 నుంచి అమలులోకి రానున్నాయి. అంతకుముందు టీఎస్ఆర్టీసీ పది కిలోల కన్నా తక్కువ బరువున్న కొరియర్ లేదా పార్శిల్ కోసం గతంలో ఒకే ఛార్జీలను వసూలు చేశారు. తాజాగా ఆ ఛార్జీలను సవరించారు. ఐదు కిలోల లోపు బరువు ఉన్న ఛార్జీలు, ఆరు నుంచి పది కిలోల లోపు బరువు ఉన్న పార్శిల్‌కు నేటి నుంచి వేర్వేరుగా ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. గతంలో 75 కిలోమీటర్ల లోపు దూరానికి పది కిలోల కంటే తక్కువ బరువు ఉన్న పార్శిల్‌కు రూ.50 వసూలు చేసేవారు. కానీ కొత్త ఛార్జీల ప్రకారం పార్శిల్ బరువు ఐదు కిలోల లోపు ఉంటే.. రూ.20, ఆరు నుంచి 10 కిలోల మధ్య బరువు ఉంటే.. దానికి రూ.50 వసూలు చేయనున్నారు.

    ఇదే సమయంలో ఇంట్రా, ఇంటర్ స్టేట్ కొరియర్ సర్వీసుల ఛార్జీలను సైతం గణనీయంగా తగ్గించింది. గతంలో 250 గ్రాముల కంటే తక్కువ బరువున్న ఇంట్రా స్టేట్ కొరియర్ కోసం రూ.50 వసూలు చేస్తే.. ఇతర రాష్ట్రాలకు రూ.75 వసూలు చేసేవారు. కానీ కొత్త ఛార్జీల ప్రకారం 250 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్న కొరియర్ ఛార్జీలు ఇంట్రా స్టేట్ అయితే రూ.20, ఇతర రాష్ట్రాలకు అయితే రూ.40 వసూలు చేయనున్నారు. టీఎస్ ఆర్టీసీ నిర్ణయం వల్ల కొరియర్, పార్శిల్ సర్వీసుల్లో మరింతగా ఆదాయం సమకూరనుంది.

    First published:

    Tags: Rtc, Telangana, Tsrtc

    ఉత్తమ కథలు