హోమ్ /వార్తలు /తెలంగాణ /

VC Sajjanar: బస్సులో తానెవ్వరో చెప్పకుండా ప్రయాణించిన సజ్జనార్.. ఆయన ఇలా ఎందుకు చేశారంటే..

VC Sajjanar: బస్సులో తానెవ్వరో చెప్పకుండా ప్రయాణించిన సజ్జనార్.. ఆయన ఇలా ఎందుకు చేశారంటే..

ముఖ్యంగా పండగల సంధర్భంలో నగరం నుండి వెళ్లే వారి తో నిండుగా వెళ్లనున్న బస్సులు తిరిగి కాళీగా రానుండడంతో అదనపు చార్జీలు పెంచుతున్నట్టు చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతుండడంతో చార్జీలు పెంచక తప్పదని అంటున్నారు.

ముఖ్యంగా పండగల సంధర్భంలో నగరం నుండి వెళ్లే వారి తో నిండుగా వెళ్లనున్న బస్సులు తిరిగి కాళీగా రానుండడంతో అదనపు చార్జీలు పెంచుతున్నట్టు చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతుండడంతో చార్జీలు పెంచక తప్పదని అంటున్నారు.

పోస్ట్ ఏదైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.. ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్(VC Sajjanar). పోలీస్ అధికారిగా ఫుల్ ఫేమ్ సాధించిన వీసీ సజ్జనార్.. ఇప్పుడు  టీఎస్‌ఆర్టీసీ(TSRTC) ఎండీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

  పోస్ట్ ఏదైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.. ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్(VC Sajjanar). పోలీస్ అధికారిగా ఫుల్ ఫేమ్ సాధించిన వీసీ సజ్జనార్.. ఇప్పుడు  టీఎస్‌ఆర్టీసీ(TSRTC) ఎండీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్.. బుధవారం ఆర్టీసీ బస్సులో సాధారణ వ్యక్తిగా ప్రయాణించారు. బస్సు కండెక్టర్‌కు, ఇతర ప్రయాణికులు తానెవరో చెప్పకుండా ప్రయాణం సాగించాడు. తోటి ప్రయాణికులతో మాటలు కలిపి.. బస్సులలో ప్రయాణించేటప్పుడు వారి సాధక, బాధకాలను తెలుసుకున్నారు. వివరాలు.. 11 గంటల సమయంలో జీడిమెట్ల డిపోకు చెందిన 9ఎక్స్ /272.. గండి మైసమ్మ నుంచి సీబీఎస్ రూట్‌లో వెళ్తున్న బస్సును లక్డీకాపూల్ బస్టాపులో సజ్జనార్ సాధారణ ప్రయాణికుడి మాదిరిగా ఎక్కారు. కండక్టర్‌కు తానెవరో చెప్పకుండా.. టికెట్ తీసుకుని ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు.

  బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తోటి ప్రయాణీకులతో మాటలు కలిపిన సజ్జనార్.. వారి సాదక, బాధకాలను స్వయంగా అడిగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎంజీబీఎస్‌లో(MGBS) కూడా సాధారణ వ్యక్తిలాగా తిరిగారు. బస్టాండు ప్రాంగణములోని పరిశుభ్రతను, ఏఏ ప్లాట్ ఫాం లలో ఏఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలియజేసే సెక్టర్ వైజ్ రూట్ బోర్డును, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పని తీరును పరిశీలించారు. అలాగే బస్టాండులోని మరుగుదొడ్ల పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. ఫ్లాట్‌పామ్‌పై ఉన్న బస్సు సిబ్బందితో మాట్లాడి ఆదాయ వివరాలు అడిగారు. బస్సులోని ప్రయాణీకులతో మాట్లాడి రవాణా సేవల తీరును అడిగి తెలుసుకున్నారు.

  ఆ తర్వాత అక్కడికి చేరుకన్న ఈడీ(హెచ్ అండ్ కే), ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పరిసరాలను శుభ్రత మరియు మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపర్చాలని, పార్కింగ్ స్థలంలో చాలా కాలంగా పేరుకుపోయున వాహనాలను తక్షణమే స్రాప్ యార్డ్‌కు తరలించాలని ఆదేశించారు. అలాగే ప్రకటనల  ద్వారా ఆదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి, పార్క్ నిర్వహణ బాధ్యతను ఔట్ సోర్సింగ్ ఏజెంట్స్‌కు అప్పగించాలని సూచించారు.

  ఖాళీగా ఉన్న స్టాల్స్‌ను భర్తీ కోసం వెంటనే చేపట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అన్నారు. పండుగలు, వివాహ సమయాలలో బస్సులను అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని అన్నారు. అలాగే రాబోవు దసరా పండుగ రద్దీకి తగిన బస్సులను నడిపి సంస్థ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పటి నుంచే రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని అలాగే తగిన ప్రచారం కూడా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Sajjanar, Tsrtc

  ఉత్తమ కథలు