హోమ్ /వార్తలు /తెలంగాణ /

V.C Sajjanar : రాత్రిపూట మహిళా ప్రయాణికులకు మరో శుభవార్త.. వీసి సజ్జనార్ కీలక ఉత్తర్వులు

V.C Sajjanar : రాత్రిపూట మహిళా ప్రయాణికులకు మరో శుభవార్త.. వీసి సజ్జనార్ కీలక ఉత్తర్వులు

vc sajjanar

vc sajjanar

V.C Sajjanar : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రిపూట బస్సు ప్రయాణంలో ఉండే ఇబ్బందులపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించి వెంటనే ఉత్తర్వులు ఇచ్చారు..

ఆర్టీసి బలోపేతానికి నడుం బిగించిన ఎండీ వీసి సజ్జనార్ అటు కార్మికుల సంక్షేమంతో పాటు ఇటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు వెనువెంటనే తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలు రాత్రిపూట చేసే ప్రయాణాయాల్లో మహిళల ఇబ్బందులపై ఫిర్యాదు చేశారు. అత్యవసరాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు. దీంతో స్పందించిన సజ్జనార్ ప్రయాణికులు అత్యవసర సమయాల్లో బస్సును ఆపవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పాటు టోల్‌ప్లాజాల వద్ద అక్కడున్న సదుపాయాలు ఉపయోగించుకునే విధంగా వినియోగించుకోవాలని డ్రైవర్స్ బస్సులో అనౌన్స్ చేయాలని పేర్కోన్నారు. దూర ప్రాంతాల ప్రయాణాల సమయంలో ప్రయాణికుల కోసం దాబాలు, హోటళ్ల వద్ద బస్సును నిలపాలని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.

కాగా ఇప్పటికే ప్రయాణికుల కోసం పలు నిర్ణయాలను ఆయన ప్రకటించారు. బస్సులో సౌకర్యాల ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఏకంగా డబ్బై కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించి ప్రయాణికు ఇబ్బందులను నేరుగా తెలుసుకునే ప్రయత్నించారు. ఇక బస్‌స్టాండ్‌లలోని వస్తువులను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్‌ఆర్‌పీ ధర కంటే అదనంగా వసూలు చేయవద్దని చెప్పారు. ఇక ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు.

ఇది చదవండి  : లిక్కర్ టెండర్లలోనే కిక్కు.. అప్లికేషన్స్‌తోనే వందల కోట్లు...


దీంతో పాటు చిల్లర సమస్యను పై ఓ ప్రయాణికుడు చేసిన ట్విట్‌కు స్పందించి ఆర్టీసీ నష్టపోయిన పర్వాలేదు కాని, ప్రయాణికుల ఇబ్బందులను ద‌ృష్టిలో పెట్టుకుని చిల్లర సమస్యను తగ్గించారు.మరోవైపు ఓ విద్యార్థి టికెట్ తీసుకుని కండక్టర్ వద్ద చిల్లరను తీసుకోవడం మరచిపోవడంతో విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాడు. దీంతో వెంటనే స్పందించిన సజ్జనార్ ఆ విద్యార్థికి తిరిగి చిల్లర డబ్బులను ఇప్పించే ఏర్పాట్లను చేశారు. ఇలా ప్రయాణికులు ఏ సమస్యపై విన్నవించినా వెంటనే స్పందించి నిర్ణయాలను అమలు పరుస్తుండడంతో ప్రయాణికుల మన్ననలు పొంది లాభాల భాటలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళుతున్నారు.

 ఇది చదవండి : నూతన రైతు చట్టాల రద్దుపై రాష్ట్ర నేతలు ఏమన్నారు.. ?

First published:

Tags: Sajjanar, Tsrtc

ఉత్తమ కథలు