హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sajjanar: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ.. వైరల్‌గా మారిన సజ్జనార్ ట్వీట్.. పోస్ట్ మాములుగా లేదుగా..

Sajjanar: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ.. వైరల్‌గా మారిన సజ్జనార్ ట్వీట్.. పోస్ట్ మాములుగా లేదుగా..

సజ్జనార్(ఫైల్ ఫొటో)

సజ్జనార్(ఫైల్ ఫొటో)

Ayyo Vaddama: తెలంగాణ ఆర్టీసీ (Telangana State Road Transport Corporation) ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ ( VC Sajjanar).. తనదైన శైలిలో పనులు చేస్తున్నారు. తనదైన శైలిలో పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

  తెలంగాణ ఆర్టీసీ (Telangana State Road Transport Corporation) ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ ( VC Sajjanar).. తనదైన శైలిలో పనులు చేస్తున్నారు. తనదైన శైలిలో పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జనాలు ప్రైవేటు వాహనాలను వదిలి, ఆర్టీసీ వైపు మొగ్గు చూపేందుకు చర్యలు చేపడుతున్నారు. బస్సులో సామాన్య ప్రయాణికునిలా ప్రయాణించిన సజ్జనార్.. ప్రయాణికులు ఇబ్బందులతో పాటు, బస్సుల్లో, బస్టాండ్‌ల పరిసరాల్లో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వినాయక నిమజ్జనానికి కూడా సజ్జన్.. తన ఫ్యామిలీతో కలిసి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా తాను సింపుల్‌గా ఉండటమే కాకుండా.. ఆర్టీసీ బస్సులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా చేస్తున్నారు.

  అంతేకాకుండా సంస్థ అభివృద్ది కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పలు మార్పులకు శ్రీకారం చూడుతున్నారు. అయితే దసరా పండగ (dussehra 2021) కోసం ఆర్టీసీ నాలుగు వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు ఉండనున్నట్టుగా ఆర్టీసీ (TSRTC) తొలుత ప్రకటించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను రద్దు చేసినట్టుగా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదివారం ప్రకటన చేశారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా పండుగ సమయంలో ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ సేవలందిస్తుందని పేర్కొన్నారు. ఈ విధంగా అదనపు చార్జీలు ఎత్తివేయడం ద్వారా.. పండగ వేళ సొంతూళ్లకు వెళ్లే ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించినట్టయింది.

  TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ.. దసరా పండుగ బస్సుల్లో ఆ చార్జీలు ఎత్తివేత..

  అయితే ఇదిలా ఉంటే ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) ప్రయాణించేలా చేసేందుకు సజ్జనార్.. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ..’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయిన డైలాగ్‌తో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సజ్జనార్ ట్విట్టర్ (Sajjanar Twitter) అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

  Shocking: నాపై 28 మంది అత్యాచారం జరిపారు.. మా నాన్నే ముందుగా.. బాలిక ఆవేదన.. ఎఫ్‌ఐఆ‌ర్‌లో రాజకీయ నాయకుల పేర్లు..


  ఈ వీడియోలో.. ఓ వ్యక్తి రోడ్డు మీద పిల్లతో కలిసి తీన్మార్ మ్యూజిక్‌కు స్టెప్పులేస్తుంటాడు. మరో వ్యక్తి తన లగేజ్‌తో ఊరు వెళ్తుంటాడు. అతడు రోడ్డు మీద ఉన్న వ్యక్తితో తాను జీప్‌లో ఊరికి వెళ్తున్నట్టుగా చెప్తాడు. అప్పుడు వెంటనే అక్కడున్న వ్యక్తి.. ‘పక్కనే ఆర్టీసీ బస్సు ఉంది.. క్షేమంగా వెళ్లొచ్చు.. డబ్బులు ఎక్కువ తీసుకోరు గానీ.. సుఖీభవ, సుఖీభవ’అని అంటాడు. ఆ తర్వాత పిల్లతో కలిసి డ్యాన్స్‌ చేయడం మొదలుపెడతాడు.


  ఈ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్ ‘అయ్యయ్యో వద్దమ్మా కానీ.. సుఖీభ‌వ‌ సుఖీభ‌వ‌ నమ్మకానికి భరోసా మన టీఎస్ ఆర్టీసీ.. RTC బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, మరియు శుభప్రదం’అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై స్పందించిన కొందరు నెటిజన్లు.. సజ్జనార్ ఏ పదవి చేపట్టిన తనదైనా శైలి లో ముద్ర వేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  తెలంగాణలో దసరా, బతుకమ్మ అతిపెద్ద పండగలు కాగా.. జనాలు ఎక్కడున్నా పండగ నాటికి సొంతూళ్లకు చేరాలని చూస్తారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 4,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. పండగ సంధర్బంలోని అక్టోబర్ 8 నుంచి14 వరకు హైదరాబాద్‌లోని ఎంబీబీఎస్, జేబీఎస్ స్టేషన్ల నుండి నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో మూడు వేల బస్సులను , ఇతర రాష్ట్రాలను మరో వెయ్యి బస్సులను నడపనున్నారు. పండగ స్పెషల్ బస్సులో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని సజ్జనార్ ప్రకటించిన తెలిసిందే.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Sajjanar, Tsrtc, VIRAL NEWS

  ఉత్తమ కథలు