అందివచ్చిన అవకాశాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సద్వినియోగ పరిచి, ఆర్టీసీని ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించి అటు ఆర్టీసీ కార్మికులకు ఇటు ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యె ప్రయత్నాలు చేస్తున్నారు. (TSRTC MD Sajjanar dance along with his family ) కాగా ఆయన తీసుకుంటున్న చర్యలు ఆర్టీసీ ఆదాయం పెంపుకు దోహదం అవుతున్నాయి. ఇందులో భాగంగానే పలు సంధార్భాలను బట్టి వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రచారం చేయడంతో పాటు, వ్యక్తిగతంగా కూడా అనేక ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగానే గణేష్ ఉత్సవాల్లో భాగంగా తానే గణేషుడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో వినాయక నిమజ్జనానికి ప్రైవేటు ట్రావేల్స్ కాదు, బస్సుల్లో కూడా కుటుంబ సభ్యులు ప్రయాణించి నిమజ్జనం చేయవచ్చనే సంకేతాలను ఇచ్చారు. (TSRTC MD Sajjanar dance along with his family ) దీంతోపాటు హైదరాబాద్ నుండి నల్గొండ వరకు ఏకంగా 70 కిలోమీటర్ల మేర సాధారణ ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించి.. బస్సు ప్రయాణికుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
.@tsrtcmdoffice VC Sajjanar కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మరియు సపరివార సమేతంగా బస్సులో ప్రయాణం చేసి @TSRTCHQ బస్సులో ప్రయాణం సురక్షితం,సుఖమయం మరియు శుభప్రదం అని ప్రయాణికులకు భరోసా కల్పిస్తున్న వైనం.
It's Family Time Huhuhu, hooch! #Hyderabad #IchooseTSRTC pic.twitter.com/wZYigHFRZC
— Abhinay Deshpande (@iAbhinayD) November 29, 2021
ఇప్పుడు తాజాగా గతంలో ఏ ఉన్నతాధికారి చేయని విధంగా తన కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణించారు. అంతేకాదు.. వారితో కలిసి డాన్స్ చేస్తూ అందరిని ఉత్సహారపరిచారు. దీంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పాటు ఇటివల ఆర్టీసీ బస్సును పెళ్లిళ్లకు తీసుకువెళ్లే వారికి కూడా ఆయన అనేక ప్రోత్సహాకాలు ప్రకటించారు. (TSRTC MD Sajjanar dance along with his family ) నూతన వధువు, వరుడికి ఓ ఫోటోను బహుమానంగా ఇచ్చే ఏర్పాటును చేశారు. ఈ క్రమంలోనే సజ్జనార్ నేరుగా వెళ్లి ఓ జంటకు ఆర్టీసీ తరుఫున బహుమతిని ఇచ్చారు. ఇలా ఆర్టీసీలో ప్రయాణం వల్ల వ్యక్తిగత ఉల్లాసంతోపాటు ,భద్రత ఎక్కువ అవకాశాలు ఉంటాయనే చెప్పడంతో పాటు కుటుంబ పరంగా బస్సును ఉపయోగించుకొవచ్చే సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.