TSRTC Breking : తెలంగాణ ఆర్టీసీపై ప్రైవేటు కత్తి వేలాడుతోంది. రానున్న కొద్ది రోజుల్లో ఆర్టీసీ గాడిన పడకపోతే ప్రైవేటుపరం తప్పదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఆ సంస్థ చైర్మణ్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు.
ఇటివల ఆర్టీసీ(tsrtc) అభివృద్దిపై దృష్టి సారించిన రాష్ట ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఎండీగా సజ్జనార్ (sajjanar)నియమించిన రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న చైర్మన్‌ను సైతం నియమించింది. దీంతో సంస్థ ప్రక్షాళనపై సీఎం (cm kcr)దృష్టి సారించినట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి అభివృద్దిపై మంగళవారం సీఎం అధ్వర్యంలో సమావేశం కూడా నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ చార్జీల ధరలు పెంచడం ద్వార నష్టాల నుండి బయట పడవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో చార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖతను సైతం వ్యక్తం చేసింది. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్న సమయంలోనే మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు.
ఈ క్రమంలోనే సీఎం ఆధ్వర్యంలో జరిగిన నిర్ణయాలను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardan) వివరించారు. రానున్న నాలుగు నెలల్లో ఆర్టీసీ కష్టాల నుండి గట్టక్కక పోతే ప్రైవేటు పరం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినట్టు ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని నిన్నటి సమావేశంలో చెప్పినట్టు వెల్లడించారు.
ముఖ్యంగా ఆర్టీసిని ఆదుకునేందుకు ఇప్పటికే ఈ సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం (state government)కేటాయించిందని అయినా.. ఆర్టీసీలో ఆశించిన ఫలితాలు రాలేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సంధర్భంగా ఆర్టీసీ కార్మికులందరు కష్టపడి పనిచేస్తే తప్ప బయటపడే అవకాశాలు లేవని ఆయన చెప్పారు.
ఈ క్రమంలోనే అందరు కలిసి , కృత నిశ్చయంతో ముందుకెళ్లాలని సూచించారు... ముఖ్యంగా ఆర్టీసీకి ఏ రూట్లో నష్టాలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై అధ్యయనం చేసి వాటిని అమలు పరచాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
ఇందుకోసం అధికారులు వెంటనే రంగంలోకి దిగి యద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ఆర్టీసీ గాడిపెట్టాలని స్పష్టం చేశారు. కరోనాతో పాటు పెరిగిన డీజిల్ ధరలు ఆర్టీసీ నష్టాలకు కారణమైనట్టు అధికారులు సీఎంకు వివరించారు. కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తే కుదరదు...అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలు తెలుసుకోవాలని అప్పుడే సంస్థ బాగుపడుతుందని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి.
ఇందులో భాగంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు కార్యాలయాలను వీడి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికైనా..కిందిస్థాయి అధికారుల నుండి ఉన్నతాధికారుల వరకు తమ పని తీరును మార్చుకోవాలని సీఎం కేసీఆర్ హితవు పలికినట్లు సమాచారం.
ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 97 డిపోల్లో ఉన్న నష్టాలు వాటి పరిష్కారాలపై దృష్టి సారించి వెంటనే వాటి పరిష్కారించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కరోనా కాలంలో అనేక సంస్థలు నష్టాలు చవి చూసిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు కరోనా, మరోవైపు డీజీల్ ధరలు పెరుగుదలలే ఆర్టీసీ నష్టాలకు ముఖ్యకారణాలుగా గుర్తించారు. దీంతో ఆర్టీసీలో చార్జీలు పెంపుదలకు సుగమం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.