ఆర్టీసీలో వారికి ఉద్యోగాలు... కేసీఆర్ హామీ అమలు...

ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఓ హామీని నెరవేర్చే దిశగా సంస్థ యాజమాన్యం ముందడుగు వేసింది.

news18-telugu
Updated: December 6, 2019, 5:26 PM IST
ఆర్టీసీలో వారికి ఉద్యోగాలు... కేసీఆర్ హామీ అమలు...
ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌(ఫైల్ ఫోటో)
  • Share this:
సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే క్రమంలో వారికి పలు హామీలు ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్. అందులో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చే అంశం కూడా ఉంది. తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ హామీని నెరవేర్చే దిశగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నలిచ్చింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 10 మందికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చారు. నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి ఆర్టీసీ కానిస్టేబుళ్లు, ఒకరికి కండక్టర్‌గా ఉద్యోగాలిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌ జోన్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు. మిగతా చోట్ల కూడా ఉద్యోగాల కుటుంబాల్లో అర్హత గలవారికి ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ వేగవంతమైనట్టు తెలుస్తోంది. సమ్మె కాలంలో దాదాపు 30 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు చనిపోయిన సంగతి తెలిసిందే.


First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>