హైదరాబాద్ వాసులకు ‘ఆర్టీసీ’ మరో షాక్ ?

ఆర్టీసీ నష్టాలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా గ్రేటర్ పరిధిలోని కొన్ని బస్సు సర్వీసులను తగ్గించాలని యోచిస్తుంది.

news18-telugu
Updated: December 10, 2019, 4:26 PM IST
హైదరాబాద్ వాసులకు ‘ఆర్టీసీ’ మరో షాక్ ?
ఆర్టీసీ ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీలో నష్టాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం... ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ నష్టాలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా బస్సు సర్వీసులను తగ్గించాలని యోచిస్తుంది. ఆర్టీసీ నష్టాలను తగ్గించుకునేందుకు హైదరాబాద్ సిటీలో బస్సు సర్వీసులు తగ్గించేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రణాళికలు సిద్దం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న 3750 బస్సు సర్వీసుల్లో వెయ్యి బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించారని సమాచారం. హైదరాబాద్‌లో ప్రతి రోజు 33 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మెట్రో వచ్చినా నగర ప్రజా రవాణాలో 40 శాతం ఆర్టీసీ బస్సులపైనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.

అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు పెంచుకోవాల్సిన ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ తగ్గించుకునే పనిలో పడిందనే చర్చ జరుగుతోంది. ప్రతి రోజు కోటికి పైగా నష్టం వస్తోందనే... ఏడాదికి రూ. 400 కోట్లకు పైగా నష్టం వస్తుందనే కారణంతో బస్సులనే తగ్గించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల కార్మికులను తగ్గించుకోవచ్చనే భావనలో యాజమాన్యం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు బస్సులు తగ్గించడంపై ఉన్నతాధికారులు భిన్నంగా స్పందిస్తున్నారు. నగరంలో నడుపుతున్న బస్సులు పదేళ్ళు దాటినవని మరమ్మత్తుల పేరుతో రోజు మూడు వందల వాహానాలు మూలన పడుతున్నాయని చెబుతున్నారు. డ్రైవర్ల కొరతతో పాటు కొందరు విధులకు రావడం లేదని చెబుతున్నారు.


First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>