ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి అరెస్ట్

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: October 18, 2019, 11:51 AM IST
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి అరెస్ట్
అశ్వత్థామరెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 18, 2019, 11:51 AM IST
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కార్మికులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించిన అశ్వత్ధామరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకపోవడం వల్లే ఆర్టీసీ జేఏసీ నేతలను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

మరోవైపు బస్ భవన్ వద్దకు కార్మికులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉందనే సమాచారం ఉండటంతో... పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్ట్ చేసిన నేతలను నగర శివార్లలోని పోలీస్ స్టేషన్లకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేపటి బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకే ప్రభుత్వం ఈ రకమైన చర్యలను పాల్పడుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న తమను రెచ్చగొట్టేందుకే ప్రభుత్వం ఈ రకంగా చేస్తోందని విమర్శిస్తున్నారు.


First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...