హోమ్ /వార్తలు /తెలంగాణ /

కార్మిక సంఘాలు కొనసాగుతాయి... చిల్లర చర్యలకు భయపడమన్న అశ్వత్ధామరెడ్డి

కార్మిక సంఘాలు కొనసాగుతాయి... చిల్లర చర్యలకు భయపడమన్న అశ్వత్ధామరెడ్డి

ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (File Photos)

ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (File Photos)

కార్మిక సంఘాలను ఎవరూ ఏమీ చేయలేరని... కార్మిక యూనియన్లు కొనసాగుతాయని అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు.

  ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులకు ఉన్న మినహాయింపులను యాజమాన్యం తొలగించడాన్ని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తప్పుబట్టారు. ఇలాంటి చిల్లర చర్యలకు తాము భయపడబోమని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై లేబర్ కమిషనర్ స్పందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయినా దీనిపై తమకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన తెలిపారు. కార్మిక సంఘాలను ఎవరూ ఏమీ చేయలేరని... కార్మిక యూనియన్లు కొనసాగుతాయని అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కార్మిక సంఘాలు కొనసాగుతాయని... తమకెవరికీ నాయకత్వం వహించాలనే ఆరాటం లేదని ఆయన తెలిపారు.

  గతంలో తాము తెలంగాణ కోసం పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమకు రాజకీయ నాయకుల తరహాలో బుగ్గ కార్లు రావని అన్నారు. ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ చర్చలకు పిలవడం మంచి పరిణామమని అశ్వత్ధామరెడ్డి తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 55 రోజులు తాము ఉద్యమం చేశామని అశ్వత్ధామరెడ్డి అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ashwathama Reddy, CM KCR, TSRTC Strike

  ఉత్తమ కథలు