సమ్మె విరమిస్తున్నాం.. విధుల్లోకి తీసుకోండి: ఆర్టీసీ జేఏసీ

ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టారు అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం నిలబడేలా, ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు.

news18-telugu
Updated: November 20, 2019, 5:30 PM IST
సమ్మె విరమిస్తున్నాం.. విధుల్లోకి తీసుకోండి: ఆర్టీసీ జేఏసీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో 47 రోజుల ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్ పడింది. సమ్మెపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ బుధవారం కీలక ప్రకటన చేసింది. సమ్మెను విరమిస్తున్నామని.. తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. కార్మికులు విధుల్లోకి హాజరైతే.. వారి ఆత్మగౌరవం కాపాడాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తీర్పుపై చర్చించిన కార్మిక సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని.. లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. కోర్టు తీర్పును ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కూడా గౌరవించాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టారు అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం నిలబడేలా, ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు. కార్మికులు డ్యూటీ చార్ట్‌ల మీద మాత్రమే సంతకాలు పెడతారని.. అది తప్ప ఇక ఎలాంటి షరతులపైనా సంతకాలు పెట్టరని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని విశ్వసిస్తున్నట్లు అశ్వత్థామరెడ్డి చెప్పారు

ఆర్టీసీ జేఏసీ ప్రకటన
First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...