ఆర్టీసీలో చార్జీల మోత.. ఏ ఊరికి ఎంత పెరిగిందో పూర్తి వివరాలు

ఇంధనం, విడి భాగాలు, టైర్ల ధరలు పెరగడంతో సంస్థపై అదనపు భారం పడుతోందని.. ఈ క్రమంలోనే బస్సు చార్జీల పెంపు అనివార్యమైందని ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

news18-telugu
Updated: December 2, 2019, 7:52 PM IST
ఆర్టీసీలో చార్జీల మోత.. ఏ ఊరికి ఎంత పెరిగిందో పూర్తి వివరాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లు పెరిగాయి. పల్లె వెలుగు సర్వీసుల నుంచి మొదలుకొని గరుడ ప్లస్ వరకు అన్ని బస్సుల్లోనూ టికెట్ల ధరలను పెంచారు. కిలో మీటర్‌కు 20 పైసలు చొప్పున రేట్లు పెంచారు. అటు బస్సు పాసుల రేట్లు కూడా మారిపోయాయి. కొత్త ధరలు ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ పెంపు వల్ల ఆర్టీసీకి ఏడాదికి సుమారు రూ.750 కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంధనం, విడి భాగాలు, టైర్ల ధరలు పెరగడంతో సంస్థపై అదనపు భారం పడుతోందని.. ఈ క్రమంలోనే  బస్సు చార్జీల పెంపు అనివార్యమైందని ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇకపై తెలంగాణలోని ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లోనూ కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15 పెంచారు. డీలక్స్ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20 పెరగనుంది. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ. 25 పెంచారు. ఇకపై రాజధాని, వజ్ర బస్సులో కనీస ఛార్జీ రూ. 35 పెరగనుంది. గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జీ రూ. 35 పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ. 75 పెంచారు.  ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్ పాస్ ధరలు కూడా పెరగనున్నాయి. ఆర్డీనరీ బస్ ధర రూ. 950, ఎక్స్‌ప్రెస్ రూ. 1070, డీలక్స్ రూ. 1185‌గా ఉండనుంది.

పెరిగిన ఆర్టీసీ చార్జీల వివరాలు:

ప్రధాన మార్గాల్లో పెరిగిన రేట్లు
పల్లె వెలుగు సర్వీసుల్లో టికెట్ ధరల పట్టిక


సిటీ బస్సుల్లో ఆర్టీసీ టికెట్ల ధరల పట్టిక


స్టూడెంట్స్ పాస్‌ ధరల పట్టిక
Loading...
సాధారణ పౌరులు, ఎన్జీవోల మంత్లీ పాస్ ధరల పట్టిక


 

 
First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...