ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాక్..

TSRTC : ‘ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితిని గమనించి.. సంస్థను గట్టెక్కించాలంటే ఛార్జీలు పెంచడమే సరైందని, ప్రజలు అందుకు మానసికంగా సిద్ధపడాల’ని సీఎం కేసీఆర్ అన్నారు. అందులో భాగంగా.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచనున్నట్లు ప్రకటించారు.

news18-telugu
Updated: December 1, 2019, 5:43 PM IST
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాక్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న వార్తలు.. దానికి తోడు కార్మికులు సరిగ్గా దసరా ముందే సమ్మె బాట పట్టారు.. ఏకంగా 52 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.. ప్రయాణికులకు ఇబ్బంది ఎదురవుతుందని ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులను పిలిపించుకుంది. డ్రైవర్‌కు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 ఇచ్చి రవాణాకు ఇబ్బంది కాకుండా జాగ్రత్త పడింది. అలా 52 రోజుల పాటు ప్రైవేటు వ్యక్తులకు జీతం ఇస్తూ వచ్చింది. అదే సమయంలో దసరా వేళ సమ్మె చేయడం వల్ల ఆర్టీసీ ఆదాయానికి భారీగానే గండి పడింది. దీంతో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది సంస్థ. అయితే.. సమ్మె విరమిస్తామని కార్మికులు చెప్పడంతో ప్రభుత్వం వారికి ఊరటనిచ్చింది. ఆర్టీసీని కాపాడుకునేందుకు ఇప్పటికిప్పుడు రూ.100 కోట్లు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు కూడా. అయితే.. కార్మికులు చేసిన సమ్మె వల్ల ప్రయాణికుల జేబులకు చిల్లు పడేలా ఉందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితిని గమనించి.. సంస్థను గట్టెక్కించాలంటే ఛార్జీలు పెంచడమే సరైందని, ప్రజలు అందుకు మానసికంగా సిద్ధపడాల’ని సీఎం కేసీఆర్ అన్నారు. అందులో భాగంగా.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచనున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం.. ఆ ఛార్జీలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ సిటీ, పల్లె వెలుగు బస్సులో రూ.10 కనీస ఛార్జీగా నిర్ణయించే అవకాశమున్నట్లు సమాచారం. ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెరగనుంది.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>