హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC: టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​.. రైతులకు నేరుగా ఎరువుల సరఫరా.. వివరాలివే

TSRTC: టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​.. రైతులకు నేరుగా ఎరువుల సరఫరా.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తున్నది. సాంకేతికతను ఉపయోగించుకుంటూ అందివచ్చిన అ అవకాశాలను వాడేసుకుంటోంది .

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Srinivas.P, News18, Karimnagar)


  ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తున్నది.ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటూ అందివచ్చిన అ అవకాశాలను వాడేసుకుంటోంది.బస్సు ప్రయాణాన్ని మరింత సులభతర చేయడంతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహించడానికి వీలుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు.ఆర్టీసీ సిబ్బంది కార్గో సేవలపై విస్తృతంగా ప్రచారం చేయ పాటు నమ్మకమైన డెలివరీ అందించడంతో అనతికాలంలోనే గుర్తింపు వచ్చింది .


  Arogya sri: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్​కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ.. వివరాలివే


  ఇప్పుడు కరీంనగర్ (Karimnagar) రీజియన్ పరిధిలోని పది డిపోల పరిధి నుండి హౌసింగ్ షిఫ్టింగ్, ఫర్నీచర్ రైతులకు ఎరువులు, విత్తనాల బస్తాల వరకు చేయడానికి ఆర్టీసీ నిర్ణయించింది.మొదటగా గూడ్స్ వస్తువులతో పాటు కవర్లు, ఇతర చిన్నచిన్న సామగ్రి మాత్ర మే సరఫరా చేసేవారు.ఆ తర్వాత వినూత్న పథకాలతో ఆదాయ మార్గాలను పెంచుకున్నారు. ములుగు (Mulugu) జిల్లాలో జరిగిన సమ్మక్క సారక్క జాతరలో బెల్లం ప్రసాదాల పంపిణీ, జగిత్యాల నుంచి బంగినపల్లి మామిడిపండ్ల సరఫరా, శ్రీరాముని కల్యాణోత్సవ తలంబ్రాల బుకింగ్ వంటి కార్యక్రమాలతో ఆదాయ మార్గాలను కార్గో పెంచుకుంది .


  Gram panchayats: గ్రామపంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​న్యూస్​.. పూర్తి వివరాలివే


  ఆర్టీసీ (RTC) సిబ్బంది కార్గో సేవలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు నమ్మకమైన డెలివరీ అందించడంతో అనతికాలం లోనే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కరీంనగర్ రీజియన్ పరిధిలోని పది డిపోల పరిధి నుంచి సికింద్రాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తువులు, హౌస్ షిఫ్టింగ్ కు, ఫర్నిచర్, తౌడు బస్తాలు, విత్తనాల బస్తాలు మరియు ఎరువులు ఇతర వస్తువులు ఒక టన్ను నుంచి పది టన్నుల వరకు అతి తక్కువ ధరలో రవాణా చేయడానికి ఆర్టీసీ నిర్ణయించింది.ఇందుకు కార్గో బస్సులు సిద్ధంగా ఉంచారు.  కరీంనగర్లో (Karimnagar) ఈ సేవలు అమలులోకి వచ్చాయి ..


  Singareni: అదో మాయా ప్రపంచం.. ఆ గనుల్లో ఊపిరి అందదు.. వెంటిలేషన్​ ఉండదు.. నీరు దొరకదు.. 


  కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా 17 పికప్ పాయింట్లు రీజియన్ వ్యాప్తంగా గోదావరిఖని , పెద్ద పల్లి , హుజూరాబాద్ డిపో పరిధిలో హుజూరాబాద్, జమ్మికుంట, కేశవ పట్నం , ఎల్కతుర్తి , కరీంనగర్ -1 డిపో పరిధిలో కరీంనగర్ , కరీంనగర్ -2 డిపో పరిధిలో ధర్మారం , సుల్తానాబాద్ , గంగాధర , మంథని డిపోలో , జగిత్యాల డిపో పరిధిలో జగిత్యాల , ధర్మపురి , కోరుట్లలో, మెట్​పల్లిలో , సిరిసిల్లలో,  వేములవాడ లో కార్గో పికప్ పాయింట్లను ఏర్పాటు చేశారు

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Farmers, Fertilisers, Telangana Government, Tsrtc

  ఉత్తమ కథలు