హోమ్ /వార్తలు /తెలంగాణ /

Waterfalls: తెలంగాణలో జలపాతాలు చూడాలనుకునేవారికి TSRTC గుడ్​న్యూస్​..

Waterfalls: తెలంగాణలో జలపాతాలు చూడాలనుకునేవారికి TSRTC గుడ్​న్యూస్​..

టీఎస్​ఆర్టీసీ

టీఎస్​ఆర్టీసీ

తెలంగాణలో విహారయాత్రలకు వెళ్లాలనుకునేవారికి టీఎస్​ఆర్టీసీ (TSRTC) గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురానున్నట్టు తెలిపింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో విహారయాత్రలకు (Tour) వెళ్లాలనుకునేవారికి టీఎస్​ఆర్టీసీ (TSRTC) గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురానున్నట్టు తెలిపింది. పోచంపాడు, పొచ్చెర, కుంటాల జలపాతాలకు (Waterfalls) ప్రత్యేక సర్వీసులను ప్రారంభించినట్టు ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​  చెప్పారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. విహార యాత్రలు చేసేవారు ఈ సేవలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పోచంపాడు, పొచ్చెర, కుంటాల జలపాతాలకు (Kuntala waterfalls) ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్‌ (MGBS) నుంచి ఉదయం 5 గంటలకు, జేబీఎస్‌ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతాయి. పెద్దలకు రూ.1,099, పిల్లలకు రూ.599 టికెట్‌ ధర నిర్ణయించారు.

  నిజామాబాద్‌ నుంచి కుంటాల జలపాతానికి ప్రత్యేక బస్సులు ప్రతి ఆదివారం ఉదయం 8:00 గంటలకు బయలుదేరుతాయి. సాయంత్రం 5:00 గంటలకు ఈ బస్సు తిరిగి నిజామాబాద్‌ చేరుకుంటుంది. పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.200 టికెట్‌ ధరలు నిర్ణయించారు. నిర్మల్‌ బస్టాండ్‌ నుంచి కుంటాల జలపాతం వరకు నిత్యం బస్సులు నడుస్తాయి. పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110 టికెట్‌ ధర నిర్ణయించారు. టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ www.tsrtconline.in లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

  ఛార్జీలను సమానం చేస్తూ నిర్ణయం..

  తెలంగాణ ఆర్టీసీ (TSRTC) మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా సజ్జనార్ (Sajjanar) మరో కీలక కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఆర్టీసీలో గరుడ, రాజధాని బస్సులకు వేర్వేరుగా ఛార్జీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అత్యంత లగ్జరీగా ఉంటూ ఏసీ సదుపాయం ఉండే గరుడ బస్సుల్లో ఛార్జీలు అధికంగా ఉంటాయి. రాజధాని బస్సుల్లో గరుడాతో పోల్చితే ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అయితే.. ఈ రెండు బస్సు ఛార్జీలను సమానం చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ.

  రాష్ట్రంలో నడిచే అన్ని బస్సు సర్వీసుల్లో ఈ నెల 30వ తేదీ వరకు ఇది అందుబాటులో ఉండనుంది. ఇంకా హైదరాబాద్-విజయవాడ (Hyderabad - Vijayawada) రూట్లో నడిచే గరుడ బస్సుల ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలతో సమానం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఈ విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు సజ్జనార్. అన్ని బస్ స్టేషన్లలో ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

  ఇదిలా ఉంటే.. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మీరు వ్యాపారాన్ని నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టాండ్ లో (MGBS) మీరు వ్యాపారం చేయొచ్చు. బస్టాండ్ లోని స్టాల్స్ లో బేకరీ, స్వీట్ షాప్, సూపర్ మార్కెట్, ఫుట్ వేర్, బ్యాగ్స్, టీ, స్నాక్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయ కేంద్రం నిర్వహించుకోవచ్చు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Best tourist places, RTC buses, Telangana, Tsrtc, Water

  ఉత్తమ కథలు