హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరం...రిటైర్మెంట్ వయస్సు పెంపుదల

Breaking: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరం...రిటైర్మెంట్ వయస్సు పెంపుదల

కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసీ పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని నిన్న జరిగిన సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరం అందించాడు. రిటైర్మంట్ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలుకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది.

  తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరం అందించాడు. రిటైర్మంట్ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలుకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీలో పనిచేసే అందరికీ ఈ రిటైర్మెంట్ వయస్సు పెంపుదల వర్తిస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఇదిలా ఉంటే గతంలో ప్రగతి భవన్ లో కార్మికులతో ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్..కార్మికులతో కలిసి భోజనం చేస్తూ.పలు హామీలు ఇచ్చారు. అందులో భాగంగా మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహిళ ఉద్యోగులు కోరిన విదంగా ప్రసూతి సెలవులు మంజూరు చేశారు.

  ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంట్ వయో పరిమితి 60 సంవత్సరాలకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: CM KCR, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు