ఆర్టీసీ మిలియన్ మార్చ్‌పై హైదరాబాద్ సీపీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ యూనియన్, నిషేధిత మావోయిస్టు అనుబంధ సంస్థలు, న్యూడెమోక్రసీ, ఇతర పార్టీల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారని ఆరోపించారు.

news18-telugu
Updated: November 9, 2019, 7:57 PM IST
ఆర్టీసీ మిలియన్ మార్చ్‌పై హైదరాబాద్ సీపీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
  • Share this:
హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన మిలియన్ మార్చ్ ఉద్రిక్తతలకు దారితీసింది. పలు చోట్ల ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాంతో పోలీసులు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ట్యాంక్ బండ్‌ చోటు చేసుకున్న పరిణామాలపై హైదరాబాద్ సీపీ అంజినీ కుమార్ వివరణ ఇచ్చారు. అనుమతి లేకున్నా ట్యాంక్ బండ్‌పై ర్యాలీ చేసేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారని ఆయన చెప్పారు. వారిని అడ్డుకునే క్రమంలో ఏడెనిమిది చోట్ల ఆర్టీసీ యూనియన్, నిషేధిత మావోయిస్టు అనుబంధ సంస్థలు, న్యూడెమోక్రసీ, ఇతర పార్టీల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారని ఆరోపించారు. వారిని అడ్డుకునే క్రమంలో పలువురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు.

నిరసనకారుల రాళ్ల దాడిలో చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్, ఎస్ఐ శేఖర్, అడిషనల్ డీసీపీ రామ్‌ చందర్, ఏసీపీ రత్నం, సైఫాబాద్ SHO సైదిరెడ్డి, కానిస్టేబుల్ ఆఫీసర్ రాజుకు గాయాలయ్యాయని పేర్కొన్నారు అంజనీకుమార్. పోలీసులపై దాడి చేయడంతో వారిపై లాఠీచార్జ్ చేశామని చెప్పారు. పోలీసులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని కమీషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
First published: November 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...