హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC: సిటీ బస్సు సర్వీసు సమయాల్లో మార్పులు.. ఈ సమయంలోనే తిరుగుతాయి.. జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు సమయాల్లో..

TSRTC: సిటీ బస్సు సర్వీసు సమయాల్లో మార్పులు.. ఈ సమయంలోనే తిరుగుతాయి.. జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు సమయాల్లో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSRTC: కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. కానీ సిటీ బస్సులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సర్వీస్ ఉంటుందో క్లారిటీ లేదు. దీంతో మొదటి రోజు సామాన్య జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు బస్సుల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి ...

రాత్రి కర్ఫ్యూ అని కొన్ని గంటల ముందు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో అప్పటికే పనులకు, ఉద్యోగాలకు వెళ్లిన వారు విధులు ముగించుకొని వచ్చే సమయంలో ఇబ్బందులకు గురయ్యారు. అప్పటికే సిటీ బస్సులు కొన్ని ప్రాంతాల్లో తిరగలేదు. రాత్రి కర్ఫ్యూ సమాచారాన్ని 24 గంటల ముందు చెబితే ముందు ప్లాన్ చేసుకునేవాళ్లం అని కొంతమంది వాపోయారు. దీంతో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సుల సమయాల్లో మార్పులు చేసింది. హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరిగే సమయాన్ని కుదించింది. ప్రతీరోజు తెల్లవారు జామున 4 గంటలకు మొదలయ్యే సిటీ బస్సు సర్వీసుల సమయాన్ని ఉదయం 6 గంటలకు కుదించింద. 6 గంటలకు మొదలయ్యే సర్వీస్ తిరిగి రాత్రి 7 గంటలకల్లా చివరి ట్రిప్పు పూర్తయ్యేలా షెడ్యూల్‌ రూపొందించింది. చివరకు అది రాత్రి 9 గంటలలోపు వాటికి సంబంధించిన డిపోలకు బస్సులను చేరవేయాలని తెలిపింది. కొన్ని సిటీ సర్వీసులు నైట్‌ హాల్ట్‌ సర్వీసులుగా నడుస్తుండగా ఇకపై అవి రాత్రి 9 గంటలకల్లా చివరి ట్రిప్పు ముగించేలా సమయాన్ని మార్చారు. ఈ బస్సు సమయాల్లో మార్పులను గమనించాలని నగరవాసులకు తెలిపారు.

ఇదిలా ఉండగా జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు విషయంలో వాటి సమయాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. అవి యథావిధిగా నడవనున్నాయని తెలిపారు. కాని ఆ సర్వీస్ బస్సులు రాత్రి కర్ఫ్యూ మొదలవక ముందే బయలుదేరి.. కర్ఫ్యూ సమయంలో గమ్యం చేరే బస్సులు బస్టాండ్లలో ప్రయాణికులను దింపొచ్చన్నారు. అక్కడ దిగిన ప్రయాణికులు ఇళ్లకు వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లు వినియోగించుకోవచ్చన్నారు. పోలీసులు అడిగినప్పుడు ప్రయాణ టికెట్‌ను చూపాల్సి ఉంటుంది. అందుకే గమ్యస్థానం చేరిన తర్వాత కూడా ప్రతీ ఒక్కరూ టికెట్ ను భద్రంగా దాచుకోవాలన్నారు. హైదరాబాద్‌ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఎక్కువగా రాత్రిపూటనే బయలుదేరుతాయి. ఈ సర్వీసులు యథావిధిగా నడుస్తాయి. రిజర్వేషన్ చేయించుకొని బస్టాండ్ కు వెళ్లే వారు రాత్రి సమయాల్లో బయలుదేరే బస్సు సర్వీసులకు సంబంధించి టికెట్ ను చూపించాలన్నారు. అక్కడ కూడా తగినంత మంది ప్రయాణికులు ఉంటేనే బస్సులు రాత్రి వేళ బయలుదేరుతాయని లేదంటే.. రద్దుచేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దీనిపై ముందుగానే సమాచారం అందిస్తామని.. వారికి సంబంధించిన టికెట్ డబ్బులను వాపస్ చేస్తామని తెలిపారు. బస్సు సర్వీసుల ఇలా ఉండగా రాత్రి కర్ఫ్యూతో ప్రమేయం లేకుండా రైళ్లు యథావిధిగా నడవనున్నాయి. కర్ఫ్యూ వేళల్లో స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు చెక్‌పోస్టుల వద్ద పోలీసులకు టికెట్లు చూపాలి. బస్సు ప్రయాణికులు అయినా.. రైల్వే ప్రయాణికులు అయినా ప్రస్తుత సమయంలో టికెట్ ను భద్రపరుచుకోవాలని పేర్కొన్నారు.

First published:

Tags: Bus services, Corona, Covid-19, Night curfew, Telangana curfew, Timings change, Tsrtc

ఉత్తమ కథలు