RTC Strike : నేడు ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్...

TSRTC Strike 35th Day : తమ డిమాండ్లు నెరవేర్చుకునే క్రమంలో... ఆర్టీసీ జేఏసీ ఇవాళ ఛలో ట్యాంక్ బండ్‌కి పిలుపిచ్చింది. దీనికి కాంగ్రెస్ మద్దతిచ్చింది.

news18-telugu
Updated: November 9, 2019, 6:02 AM IST
RTC Strike : నేడు ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
TSRTC Strike 35th Day : ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా... ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. రోజురోజుకూ సరికొత్త విధంగా తమ నిరసన తెలుపుతూనే ఉన్నారు. తాజాగా... మిలియన్ మార్చ్ తరహాలో... ఛలో ట్యాంక్ బండ్ నిర్వహించేందుకు రెడీ అయ్యారు. దీనికి కాంగ్రెస్, బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు మద్దతివ్వడంతో... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇలాంటి ఆందోళన ద్వారానే ప్రభుత్వం దిగివస్తుందనీ, డిమాండ్లు నెరవేర్చుకోవడానికే ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్ బండ్ నిర్వహిస్తున్నారనీ... దీనికి పోలీసులు సహకరించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన ప్రభుత్వం ముందుగానే చాలా మంది నాయకుల్ని అరెస్టు చేసింది. కొంతమందిని నిర్బంధించింది.

35 రోజులుగా జరుగుతున్న సమ్మెను ఆపేందుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్ని్స్తున్నా ఫలితం కనిపించట్లేదు. ఉద్యోగాల్లో తిరిగి చేరమని కార్మికులకు ఎన్ని ఆఫర్లు ఇస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది.

ప్రభుత్వం ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇచ్చే అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలోకి వచ్చింది. ఈ నెల 11 వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కేబినెట్‌లో ఏం చర్చించింది కూడా అవసరమైతే తమకు సమర్పించాలని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ అంశం కేబినెట్ నిర్ణయమనీ, దానికి కోర్టుతో సంబంధం ఏముంటుందని ప్రశ్నిస్తోంది. చట్టప్రకారమే తాము టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేశామనీ... ఆ వివరాల్ని కోర్టుకు సమర్పిస్తామని వివరించింది. హైకోర్టు మాత్రం కేబినెట్ నిర్ణయాల్ని పరిశీలించే హక్కు కోర్టుకు ఉందని స్పష్టం చేసింది.

 

Pics : అంజు శంకర్ డ్రెస్సులో అదరగొట్టిన అతుల్య



ఇవి కూడా చదవండి :సీతాఫలంపై అపోహలు, నిజాలు... ఈ సీజన్‌లో ఎందుకు తినాలంటే...

డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


Health Tips : ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్... తింటే ఎన్నో బెనిఫిట్స్...


Health Tips : ఎలాంటి కాన్సర్ నైనా తరిమికొట్టే అరుదైన నల్ల పుట్టగొడుగులు

Published by: Krishna Kumar N
First published: November 9, 2019, 5:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading