పెరిగిన డీజీల్ ధరలతో పాటు ఆర్టీసీ నష్టాల నుండి బయటపడేందుకు ప్రజలపై భారం మోపక తప్పడం లేదని చెబుతున్న అధికారులు ఇటివలే సాధారణ ప్రయాణికుల టికెట్ రేట్లను పెంచారు. ఇప్పుడు తాజాగా సిటిబస్సుల్లో తిరిగే బస్‌పాస్ ప్రయాణికులపై భారం వేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు ఇచ్చే పాసులు కాకుండా జనరల్‌గా ఇచ్చే బస్‌పాస్‌ల ధరలను భారీగానే పెంచారు.
ఈ క్రమంలోనే ఆర్డీనరీ పాస్ చార్జీ ప్రస్తుతానికి 950 రూపాయలు ఉండగా.. దాన్ని 1150 రూపాయలకు పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ కు 1070 నుండి 1300 కు పెంచారు. ఇక 1185 రూపాయలు ఉన్న మెట్రో డిలక్స్ పాసును 1450 రూపాయలకు పెంచారు. మెట్రో లగ్జరీ 2 వేల నుండి 2400కు పెంచారు.
Hyderabad : వేడెక్కిన ఇరానీ చాయ్.. పెరిగిన కప్పు ధర... ఎంతంటే..
మరోవైపు ఎన్జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి..కూడా ధరలను పెంచారు.. వీటిలో ఆర్డినరీ పాస్ చార్జీ రూ.320 నుండి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్-ఆర్టీసీ కోంబో టికెట్ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది.
కాగా ఇటీవలే చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్ చేయటంతో గరిష్టంగా టికెట్ ధర రూ.5 మేర పెరిగింది. గతం లో రౌండాఫ్ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజాగా బస్‌పాస్ చార్జీలను సవరించిన విషయం తెలిసిందే...ఇక ఆర్టీసీలో ధరలను మరింత పెంచుకునేందుకు సీఎంకు ఫైల్ పంపించారు. ఒకవేళ సీఎం కేసీఆర్ అందుకు అంగీకరిస్తే.. మాత్రం మరింత రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.