తెలంగాణ... కొమరం భీమ్ జిల్లాలో అనుకోని రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇదంతా జరగడానికి కారణం బస్సు డ్రైవర్ అని తెలిసింది. ఛాతీలో నొప్పి రావడంతో.. అది హార్ట్ ఎటాక్ కావచ్చని భావించిన డ్రైవర్.. బస్సును స్లో చేసి.. బస్సు నుంచి కిందకు దూకేసినట్లు తెలిసింది. దాంతో... కాస్త ముందుకు వెళ్లిన బస్సు అదుపు తప్పి బోల్తా పడి.. చక్రాలు పైకి తేలాయి.
ఈ TSRTC బస్సు అసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు తెలిసింది. ప్రయాణికులు డ్రైవర్ ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండి ఉంటే... ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Road accident, RTC buses, Telangana News, Tsrtc