60 మంది ప్రాణాలతో బస్సు డ్రైవర్ చెలగాటం... తప్పిన ముప్పు

వరంగల్ నుంచి తొర్రూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇరుకైన మార్గం ద్వారా వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పైన ఉన్న 11కిలోవాట్స్ విద్యుత్ తీగలను గమనించకుండా వెళ్లాడు.

news18-telugu
Updated: February 26, 2020, 2:03 PM IST
60 మంది ప్రాణాలతో బస్సు డ్రైవర్ చెలగాటం... తప్పిన ముప్పు
ఆర్టీసీ ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 11కేవీ వైర్లు తెగిపడింది. అయితే, అదే సమయంలో ఫ్యూజ్ కొట్టేయడంతో బస్సుకు విద్యుత్ షాక్ కొట్టలేదు. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలయ్య పల్లి శివారులో పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని భార్యాభర్తలు మరణించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ మృతదేహాలతో వర్ధన్నపేటలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వరంగల్ నుంచి తొర్రూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇరుకైన మార్గం ద్వారా వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పైన ఉన్న 11కిలోవాట్స్ విద్యుత్ తీగలను గమనించకుండా వెళ్లాడు. బస్సు తగిలి సర్వీస్ వైరు తెగి పడింది. ఈ సమయంలో బస్సులో సుమారు 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.

బస్సు వేగానికి ఒక్కసారిగా వైరు తెగడంతో ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టివేసి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది ఆ రూట్లో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటూ ప్రయాణికులు ఆగ్రహంతో బస్సు దిగి వెళ్లిపోయారు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు