TSRTC | పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ఇవే

తెలంగాణలో నేటి అర్థరాత్రి నుంచి బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.

news18-telugu
Updated: December 2, 2019, 5:40 PM IST
TSRTC | పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో నేటి అర్థరాత్రి నుంచి బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే సమయంలోనే బస్సు ఛార్జీలను కూడా పెంచుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్... కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతామని అన్నారు. ఈ క్రమంలోనే నేటి అర్థరాత్రి నుంచి బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇకపై తెలంగాణలోని ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లోనూ కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది.

సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15 పెంచారు. డీలక్స్ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20 పెరగనుంది. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ. 25 పెంచారు. ఇకపై రాజధాని, వజ్ర బస్సులో కనీస ఛార్జీ రూ. 35 పెరగనుంది. గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జీ రూ. 35 పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ. 75 పెంచారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్ పాస్ ధరలు కూడా పెరగనున్నాయి. ఆర్డీనరీ బస్ ధర రూ. 950, ఎక్స్‌ప్రెస్ రూ. 1070, డీలక్స్ రూ. 1185‌గా ఉండనుంది.



First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...