హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తెలంగాణలో త్వరలోనే బస్సు ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంపు ?

Telangana: తెలంగాణలో త్వరలోనే బస్సు ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంపు ?

6. కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తవడంతో ఖాళీలపై ఒక అంచనా వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 65వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రత్యక్షంగా భర్తీ చేసే ఉద్యోగాలు, పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగాలపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల అయితే తెల‌గాణ నిరుద్యోగులు ఏళ్లుగా ఎద‌రు చూస్తున్న అద్భుత అవ‌కాశం అందుకొంటారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

6. కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తవడంతో ఖాళీలపై ఒక అంచనా వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 65వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రత్యక్షంగా భర్తీ చేసే ఉద్యోగాలు, పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగాలపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల అయితే తెల‌గాణ నిరుద్యోగులు ఏళ్లుగా ఎద‌రు చూస్తున్న అద్భుత అవ‌కాశం అందుకొంటారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Telangana: ఆర్టీసీతో పాటు విద్యుత్ అంశాలకు సంబందించి రాబోయే కేబినెట్‌లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలతోపాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా అటు ఆర్టీసీ, ఇటు విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ దీనిపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసీ పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం హైద్రాబాద్ పరిథిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సీఎం కేసీఆర్‌కు రవాణాశాఖ మంత్రి, సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు విన్నవించుకున్నారు. ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైన సమయంలోనే కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. గత మార్చి 2020 అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటించిందని, కాగా కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

medak, trs sarpanch, congress, Telangana politics, టీఆర్ఎస్, సర్పంచ్, మెదక్, తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ న్యూస్,
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఇప్పటికే, ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే ఆర్టీసీని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తోందని.. ఇంకా ప్రభుత్వం మీదనే అదనపు భారం మోపాలనుకోవడం లేదని తెలిపారు. చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప కరోనానంతర పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్ ధరల ప్రభావంనుంచి బయటపడి భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆర్టీసీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తీసుకుని రాబోయే కేబినెట్ సమావేశం ముందుకు రావాలని ఆదేశించారు. అందులో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..

YS Jagan: ఏపీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. వారిచ్చే నివేదికలే సీఎం జగన్‌కు కీలకమా ?

అనంతరం రాష్ట్రంలో విద్యుత్తు అంశంపై విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి, సిఎండీ ప్రభాకార్ రావు సీఎం కేసీఆర్‌తో చర్చించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరే విద్యుత్తు సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని వివరించారు. గత ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను సవరించలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి విద్యుత్ చార్జీలు పెంచాలని వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీతో పాటు విద్యుత్ అంశాలకు సంబందించి రాబోయే కేబినెట్ లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని రవాణా శాఖా మంత్రిని, విద్యుత్ శాఖా మంత్రిని సంబంధిత అధికారులను సిఎం కేసిఆర్ ఆదేశించారు.

First published:

Tags: CM KCR, ELectricity, Telangana, Tsrtc

ఉత్తమ కథలు