తెలంగాణ పదో తరగతి ఫలితాల రీ కౌంటింగ్ సబ్జెక్ట్‌కు రూ.500... రీ వెరిఫికేషన్‌కు రూ.1000

రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు ఫారాలు www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

news18-telugu
Updated: May 14, 2019, 7:29 AM IST
తెలంగాణ పదో తరగతి ఫలితాల రీ కౌంటింగ్ సబ్జెక్ట్‌కు రూ.500... రీ వెరిఫికేషన్‌కు రూ.1000
(ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 14, 2019, 7:29 AM IST
తెలంగాణలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సారి కూడా అమ్మాయిలే ఉత్తీర్ణతలో పైచేయి సాధించారు. జగిత్యాల జిల్లా టాప్ ప్లేస్‌లో నిలవగా.. హైదరాబాద్ చిట్టచివరి స్థానం దక్కించుకుంది. అయితే పదో తగరతి ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించారు. ఫలితాలు వెలువడిన రోజు నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు ఫారాలు www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసే విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రీ వెరిఫికేషన్ కోసం రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసే విద్యార్థులు వారి దరఖాస్తును నేరుగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికి పోస్టు ద్వారా పంపించ వచ్చు. లేదా కార్యాలయానికి వెళ్లి నేరుగా అయినా దరఖాస్తు ఫారమ్‌ను ఇవ్వొచ్చు. దరఖాస్తు ఫారంపై స్కూల్ ప్రధానోపాధ్యాయుడి సంతకం చేయించుకుని రూ. 1000 చలానాతో పాటు హాల్ టికెట్ జిరాక్స్ కాపీని జత చేయాల్సి ఉంటుంది.

First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...