TS SSC Results 2019: విడుదలైన పదో తరగతి ఫలితాలు

Telangana SSC Results 2019 | పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,52,280 మంది నమోదు చేసుకోగా 5,46,728 మంది హాజరయ్యారు. వారిలో 5,06,202 మంది రెగ్యులర్ విద్యార్థులు, 40,526 మంది ప్రైవేట్ విద్యార్థులు. మొత్తం 92.43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

news18-telugu
Updated: May 13, 2019, 2:06 PM IST
TS SSC Results 2019: విడుదలైన పదో తరగతి ఫలితాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డీ బ్లాక్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,52,280 మంది నమోదు చేసుకోగా 5,46,728 మంది హాజరయ్యారు. వారిలో 5,06,202 మంది రెగ్యులర్ విద్యార్థులు, 40,526 మంది ప్రైవేట్ విద్యార్థులు. మొత్తం 92.43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది పదో తరగతి ఉత్తీర్ణత 83.78 శాతం మాత్రమే. ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. ఈసారి బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం బాలికలు 91.18. పదో తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించడం విశేషం. రెగ్యులర్ మాత్రమే కాదు... ప్రైవేట్‌లోనూ బాలికలదే పైచేయి. ప్రైవేట్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 56.53 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 61.40, బాలుర ఉత్తీర్ణత శాతం 53.65. మొత్తం 11,026 హైస్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణతను 4374 పాఠశాలు సాధించాయి. 9 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలొచ్చాయి. 99.73 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 83.09 శాతంతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 97.78 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. జూన్ 10 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుంది తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.

ఈ ఫలితాలను www.bse.telangana.gov.in, http;//results.cgg.gov.in వెబ్ సైట్లతో పాటు www.telugu.news18.comలో చూడొచ్చు. పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్ద ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ఈ యాప్‌ద్వారా క్షణాల్లో పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక యాప్‌ TSSSCBOARD అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. విద్యార్థులు, టీచర్లు ఆండ్రాయిడ్ ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి



ఇవి కూడా చదవండి:

Career Guidance: టెన్త్ తర్వాత ఏం చదవాలి? తెలుసుకోండి

Jobs After 10th: టెన్త్ పాసయ్యారా? ఉద్యోగావకాశాలు ఇవే... 
First published: May 13, 2019, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading