Home /News /telangana /

TS SPEAKER POCHARAM SRINIVASREDDY GOT CORONA POSITIVE VRY

TS Speaker corona : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా .. ఇటివలే మనవరాలి పెళ్లి.. హాజరైన ఇద్దరు సీఎంలు

speaker pocharam

speaker pocharam

TS Speaker corona : తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా పాజీటివ్ నిర్దారణ అయింది. చికిత్స కోసం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజీటివ్ సోకింది. (TS Speaker pocharam srinivasreddy got corona positive ) సాధారణ చికిత్సల్లో భాగంగా నిన్న రాత్రి ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు ఆసుపత్రి వైద్యులు పలు పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఎలాంటీ సమస్యలు లేవని పోచారం చెప్పారు. ( TS Speaker pocharam srinivasreddy got corona positive ) డాక్టర్ల సూచనల మేరకే ఆసుపత్రిలో చేరానని వెల్లడించారు. అయితే గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారితో పాటు సన్నిహితంగా ఉన్నవారు సైతం కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.

    అయితే ఆయన మనవరాలి వివాహాం ఇటివల నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌ జరిగింది. ఆ వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు కేసిఆర్, జగన్‌మోహన్‌రెడ్డిలు హాజరయ్యారు. ఇద్దరు కలిసి పోచారం శ్రీనివాస రెడ్డితో కాసేపు ముచ్చటించారు.కాగా ఆ పెళ్లికి ఏపీ స్పీకర్ తోపాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హజరయ్యారు.

    ఇది చదవండి : జీహెచ్‌ఎంసీ రాజకీయం.. కేటీఆర్ ఆదేశాలు.. 32 మంది కార్పోరేటర్లపై కేసు

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Pocharam Srinivas Reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు