ప్రపంచంలో ఎక్కడో ఉన్నరష్యా–ఉక్రెయిన్ (Russia- Ukraine) దేశాల మధ్య పంచాయతీ ఆర్టీసీ నెత్తిన పిడుగు పడేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాల పంచాయతీ కారణంగా ఇంధన ధరలు పెరిగాయి.. ముఖ్యంగా బ్యారెల్ ధరలో పెద్ద మార్పు కనిపించేలా ఉంది. ప్రస్తుతం ఒక్కరోజు వ్యవధిలో లీటర్ డీజిల్ ధర దాదాపు రూ.6 పెరిగి పోయింది. సంస్థ దీంతో సంస్థ ఆర్థికంగా ఉక్కిరికిబిక్కిరవుతోంది. సాధారణ జనానికి కూడా పెట్రోల్ ధరల పెంపు భారం తగలాల్సి ఉన్నా, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు (Five Stat Election) జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చమురుపై వేసే పన్నులను సర్దుబాటు చేస్తోంది. దీని ద్వారా సాధారణ జనానికి భారాన్ని తప్పించింది. కానీ ఈ సర్దుబాటు ఆర్టీసీకి లేకుండా పోయింది. అసలే నష్టాలతో అటు ఇటు నెట్టుకొస్తున్న ఆర్టీసీకి ఈ ఇంధన ధరల పెరుగుదల పెద్ద దెబ్బగా మారుతోంది.
Ukraine Crisis: అవసరాలు, అహం, ఆత్మాభిమానం.. ఉక్రెయిన్ సంక్షోభానికి కారణాలు ఏంటీ?
ఈ కారణంగా ఆర్టీసీ RTC) సగటున రోజుకు రూ.30 లక్షల అదనపు భారం పడటంతో విలవిల్లాడుతోంది. చమురు కంపెనీల నుంచి నేరుగా కొనే విధానాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి, సాధారణ బంకుల నుంచి లూజుగా కొనేందుకు ఏర్పాట్లు చేసుకునే పనిలో పడింది.
Credit card Myths: క్రెడిట్ కార్డు తీసుకోవడం.. వినియోగంపై సందేహాలు ఉన్నాయా.. నిజాలు తెలుసుకోండి!
రాష్ట్రంలో ఆర్టీసీదే పెద్ద కొనుగోలు..
ప్రస్తుతం చమురు కంపెనీలకు ఆర్టీసీ అతిపెద్ద కొనుగోలుదారు. బహిరంగమార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకే ఆర్టీసీకి వీరు ఇంధనం అందించేలా ఒప్పందాలు చేసుకుంటాయి. బయటి వాహనదారులకు దొరికే ధరతో పోలిస్తే ఎప్పటికప్పుడు లీటరుకు రూ.4 నుంచి రూ.5 చొప్పున తక్కువకే ఆర్టీసీ డీజిల్‌ను పొందుతోంది. ఈ డిస్కౌంట్ ప్రకారం..సంస్థకు సగటున నెలకు రూ.7.5 కోట్లు ఆదా అవుతోంది. అయితే ఆ విధానమే ఇప్పుడు ఆర్టీసీని ఇబ్బందుల్లోకి నెట్టింది. మూడురోజుల క్రితం వరకు డీజిల్‌ను లీటరుకు రూ.90.11కి కొంటున్న ఆర్టీసీ ఏకంగా రూ.95.86కు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
Afghanistan: ఆఫ్ఘన్‌కు అమెరికా షాక్.. 700 కోట్ల డాలర్లు.. ఎవరికో తేల్చిన అగ్రరాజ్యం!
ప్రత్యామ్నాయాలపై దృష్టి..
ప్రస్తుతం రోజుకు 5 లక్షల నుంచి 5.50 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్న ఆర్టీసీకి దీనివల్ల రూ.28 లక్షల నుంచి 30 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. అంటే నెలకు దాదాపు రూ.9 కోట్ల అదనపు భారమన్న మాట. దీంతో ఆయిల్ కంపెనీలతో చర్చించింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినందున చేసేదేమీలేదని కంపెనీలు చెప్పటంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diesel price, Oil prices, Tsrtc