హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kinnera Mogulaiah : ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట.. ఫిదా అయిన ఎండీ సజ్జనార్..కానుకగా...

Kinnera Mogulaiah : ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట.. ఫిదా అయిన ఎండీ సజ్జనార్..కానుకగా...

kinnera

kinnera

Kinnera Mogulaiah : బీమ్లా నాయక్ సింగర్ కిన్నెర మొగులయ్యకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటివల ఆయన ఆర్టీసీ మీద పాడిన పాటకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణంతో కూడిన బస్‌పాస్‌ను అందించింది.

  అందివచ్చిన అవకాశాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సద్వినియోగ పరుచి ఆర్టీసీని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించి అటు ఆర్టీసీ కార్మికులకు ఇటు ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యె ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు తన ప్రయత్నాల్లో భాగంగా పలు సంధార్భాలను బట్టి వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నారు.

  ఈ క్రమంలోనే ఇటివల బీమ్లా నాయక్ సినిమాలో పాట పాడి పాపులర్ అయిన కిన్నెర మొగులయ్యా ( Kinnera Mogulaiah) ఇటివల తన కూతురు వివాహానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్సు ముందు నిలబడి ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ తన స్టైల్లో ఓ పాట పాడాడు... అది బస్సు కాదు.. తల్లిలాంటిదని.. ఇందులో ప్రయాణం చాలా సంతృప్తిగా ఉందంటూనే.. శభాష్ సజ్జనార్ సర్.. అంటూ ప్రశంసించారు.

  ఇది చదవండి : ముగిసిన విత్ డ్రా సమయం.. సగం స్థానాల్లో అభ్యర్థుల ఏకగ్రీవం


  దీంతో కిన్నెర వాయిస్తూ పాడిన ఆ పాటకు సోషల్ మీడియాలో ( social media ) మంచి స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులోన ప్రయాణం ఆనందకరమని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఈ పాట ద్వారా మొగులయ్య సందేశం ఇచ్చారు. ఇది కాస్తా సజ్జనార్ దృష్టికి రావడంతో.. ఆయన ఆయన కూడా స్పందించారు. ఆర్టీసీ కోసం స్వతంత్ర్యంగా పాట పాడిన క్రమంలోనే మొగులయ్యకు సరైన గుర్తింపు నిచ్చేందుకు బస్‌భవన్‌లో (bus bhavan) కు పిలిచి ఎండీ సజ్జనార్‌ సన్మానించారు. అనంతరం ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను అందజేశారు. భవిష్యత్తులో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్‌ కోరారు.

  ఇది చదవండి : లక్షలు ఖర్చు పెట్టిన దక్కని ప్రియురాలి ప్రేమ.. ఫేస్‌బుక్ లైవ్.. తో యువకుడు ఆత్మహత్య...


  కాగా ఇటివల ప్రముఖ నటుడు అల్లు అర్జున్ చేత రూపోందిన ఓ ప్రైవేటు యాడ్‌ ఆర్టీసీ ( tsrtc )ప్రయాణికులతో పాటు ఆర్టీసీ వ్యవస్థను కించపరిచే విధంగా ఉండడడంతో ఆ కంపనీతో పాటు అల్లు అర్జున్‌కు ( Allu arjun ) షోకాజ్ నోటీసులు పంపారు. దీంతో దిగి వచ్చి ఆ కంపనీ తన యాడ్‌లో మార్పులు చేసుకుని ప్రసారం చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆర్టీసి ప్రయాణాన్ని కీర్తించిన కిన్నెర మొగులయ్యను సముచిత స్థానం ఇచ్చి గౌరవించడంతో ఆ సంస్థ ప్రతిష్ట మరింత చేకూరనుంది.

  కాగా కిన్నెర మొగులయ్య స్వగ్రామం జిల్లాకు చెందిన నల్లమల్ల అడవుల్లోని దళిత కుటుంబానికి చెందినవాడు . గత కొద్ది సంవత్సరాల కిన్నెర వాయిద్యంపై స్వంతగా తన తండ్రి నుండి పాటలు నేర్చుకోవడంతో పాటు కిన్నెర వాయించడం నేర్చుకున్నాడు. దీంతో ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం సైతం గుర్తించి సత్కరించింది. కాగా ఇటివల పవన్ కళ్యాన్ నటించిన బీమ్లానాయక్ సినిమాతో ఆయన మరింత పాపులర్‌లోకి వచ్చారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, Sajjanar, Tsrtc

  ఉత్తమ కథలు